
తేదీ : 21/03/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , గుడివాడ ప్రస్తుతం వేసవి సీజన్లో ప్రజలకు త్రాగునీటి సమస్యలు తలెత్తకూడదని ఆ దశగా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అనడం జరిగింది. పట్టణం రాజేంద్రనగర్ లోని తన గృహంలో మున్సిపల్ అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించారు.
సమావేశంలో పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ బి. శ్రీనివాసరావు, అసిస్టెంట్ కమిషనర్ ఎ.యన్ ప్రసాద్. పలు అంశాలపై మాట్లాడారు. త్రాగునీరు, శానిటేషన్ పై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే రామ సూచించారు. శివారు ప్రాంతాలకు సైతం తాగునీటి ఇబ్బందులు కలెత్తకూడదని రివ్యూ సమావేశంలో ఎమ్మెల్యే అన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
