
వరంగల్ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, 28 ఫిబ్రవరి 2025, దేశాయిపేట రోడ్ లో గల ఒయాసిస్ పాఠశాలలో శుక్రవారం సైన్స్‌ఫేర్ కార్యక్రమం ఒయాసిస్ విద్యా సంస్థల చైర్మన్ డా.జె.ఏస్.పరంజ్యోతి అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న అల్లూరి కళాశాల ప్రిన్సిపాల్ మోజెస్ క్రిష్టఫర్ సైన్స్‌ఫేర్‌ను ప్రారంభించి మాట్లాడుతూ విద్యార్థుల్లో అంతర్లీనంగా ఉన్న నైపుణ్యాన్ని వెలుగులోకి తీసుకురావాలన్నారు. దేశంలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో కొత్తపుంతలు తొక్కుతోందని సామాన్యుల కష్టాలను తీర్చే దిశగా పరిశోధనలు పురోగతి సాధిస్తున్నాయని తెలిపారు. యం.జి.యం వైద్య నిపుణులు, పాఠశాల పూర్వ విద్యార్థులు డా.ఎ.నాగరాజు మాట్లాడుతూ సమాజంలోని అసమానతలను రూపుమాపేందుకు శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాలే అత్యుత్తమ మార్గమని తెలిపారు.
పాఠశాల చైర్మన్ డా.జె.యస్.పరంజ్యోతి మాట్లాడుతూ విద్యార్థుల్లో సైన్స్‌పై ఆసక్తిపెంచి వారి ఆలోచనలకు సానపెట్టి నూతన ఆవిష్కరణలు చేసే దిశగా సైన్స్ ఫెయిర్ చేపట్టినట్లు తెలిపారు. విద్యార్థులు ముఖ్యంగా వ్యవసాయం, ఆరోగ్య, ఆహారం, ట్రాన్స్‌పోర్ట్, కమ్యూనికేషన్, ఎన్విరాన్‌మెంట్, వేస్ట్ మేనేజ్‌మెంట్, సైన్స్ ఇంజనీరింగ్, టెక్నాలజీ అనే ప్రధాన అంశాలపైన ఎగ్జిబిట్స్‌నురూపొందించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ట్రెజరర్ జన్ను అరుణ పరంజ్యోతి, విద్యార్థులు వారి తల్లిదండ్రులు,ఉపాధ్యాయులుమరియు సిబ్బంది పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
