Thug Stole Gold : మహిళ మెడలో నుండి బంగారం చోరీ చేసిన దుండగుడు

TRINETHRAM NEWS

Trinethram News : సూర్యాపేట : Feb 28, 2025, చివ్వేంల మండలం తిమ్మాపురం గ్రామంలో గురువారం రాత్రి 7: 30 గంటలకు నారెడ్డిధనమ్మ అనే మహిళ ఇంట్లో ఉండగా గుర్తుతెలియని వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి తన మెడలో ఉన్న 4తులాల పుస్తెల తాడును తెంపుకొని పారిపోయాడు. ఆ సమయానికి ఊళ్లో కరెంట్ లేకపోవడంతో దుండగుడు అక్కడినుండి పరారయ్యాడు.

మెడ నుండి తాడును బలంగా లాగడంతో ధనమ్మకు గాయాలయ్యాయి. వెంటనే 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన పోలీసులు ధనమ్మ ఇంటికి చేరుకొని సంఘటన స్థలాన్ని పరిశీలించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

 Thug stole gold

You cannot copy content of this page

Scroll to Top