
వరంగల్ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రోబోలు ఉపయోగపడుతున్నాయి డాక్టర్ ఎం.డి అసీం ఇక్బాల్ పారిశ్రామిక రంగంలో రోబోలు విస్తృతంగా ఉపయోగ పడుతున్నాయని డాక్టర్ ఎండి అసీం ఇక్బాల్ అన్నారు. నగరంలోని ఒయాసిస్ పబ్లిక్ స్కూల్లో శుక్రవారం అన్యువల్ రోబోటిక్ ఫెయిర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాకతీయ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ ఎండి అసీం ఇక్బాల్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
మానవులు చేసేందుకు సాధ్యం కానీ పనులలో అనగా బాగా అపరిశుభ్రమైన, ప్రమాదకరమైన మొండి పనులు చేసేందుకు వీటిని ఉపయోగిస్తున్నారు ఉత్పాదక శాస్త్ర చికిత్స ఆయుధ తయారీ ప్రయోగశాల పరిశోధనలు వినియోగదారులు పారిశ్రామికవేత్తలను భారీ స్థాయిలో తయారుచేసే కార్యకలాపాలకు రోబోలను విస్తృతంగా ఉపయోగించుకుంటున్నారని తెలిపారు. పాఠశాల చైర్మన్ డాక్టర్ జె.ఎస్. పరంజ్యోతి మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ పారిశ్రామిక రోబోలు ఉపయోగంలో ఉన్నాయన్నారు. జపాన్ తన ఉత్పాదకరంగంలో ఎక్కువ రోబోలు ఉపయోగిస్తున్న దేశంగా గుర్తింపు పొందిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
