
“నల్లగొండ పంచాయతీలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి వేడుకలు. ” ఆంధ్రప్రదేశ్, త్రినేత్రంన్యూస్ ( కొయ్యూరు ) జిల్లాఇంచార్జ్ : అల్లూరి జిల్లా, కొయ్యూరు మండలం, నల్లగొండ పంచాయతీలో భారత రాజ్యాంగ నిర్మాత బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి అంటరానితనం వివక్షాలపై అలుపెరుగని పోరాటం చేసి, అస్తిత్వ ఉద్యమాలకు దిశా,దిశాలను చూపిన స్ఫూర్తి ప్రదాత భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహానీయుడికి స్మరించుకుంటూ నల్లగొండ పంచాయతీ లో, ముందుగా డా. బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. దీనిలో భాగంగా గ్రామ సర్పంచ్ జంపా రాజకుమారి అధ్యక్షతన, పంచాయతీ కార్యదర్శి జి. అప్పారావు ఆధ్వర్యంలో గ్రామసభ జరపడం జరిగింది. ముఖ్యంగా గ్రామసభలో చర్చించిన విషయాలు,
1. వేసవి దృష్టిలో పెట్టుకుని నల్లగొండ పంచాయతీ పరిధిలో ఉన్న ఏ ఒక్క గ్రామానికి మంచినీటి సమస్య లేకుండా పరిష్కరించటం, 2. పంచాయతీ గ్రామాలలో బహిరంగ మలవిసర్జన లేకుండా ఓడిఎఫ్ ప్లస్ ఫ్రీ పంచాయతీగా ఏర్పరచుటకు తగు చర్యలు చేపట్టటం , మరియు పంచాయతీ లో ఉన్న గ్రామాల్లో బాల్య వివాహాలు జరగకుండా, తగు చర్యలు పటిష్టం గా అమలు చేయటం వంటి అంశాలు చర్చించటం జరిగింది. ఈ కార్యక్రమంలో పంచాయితీ వీఆర్పీలు, సుర్ల దేవుడు రాజు, మాదల గంగరాజు, కూటమి నాయకులు, పల్లి అప్పారావు, జంపా లక్ష్మణరావు, ఆశ కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
