
క్షయ వ్యాధి లక్షణాల పై విస్తృతమైన అవగాహన కల్పించాలి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అన్న ప్రసన్న కుమారి
పెద్దపల్లి, డిసెంబర్ -07: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
క్షయ వ్యాధి లక్షణాల పై విస్తృతమైన అవగాహన కల్పించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అన్న ప్రసన్న కుమారి అన్నారు.
శనివారం గర్రెపల్లి పి.హెచ్.సి లో సమావేశ మందిరంలో నిక్షయ్ శిబిరం కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అన్న ప్రసన్న కుమారి ప్రారంభించి నిక్షయ శిబిరం వాహనం జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అన్న ప్రసన్న కుమారి మాట్లాడుతూ, క్షయ వ్యాధి లక్షణాల గురించి అవగాహన పెంచుకొవాలని అన్నారు . తెమడ తో కూడిన దగ్గు, తెమడలో రక్తం పడడం, ఛాతిలో నొప్పి, జ్వరం, బరువు తగ్గడం, ఏదైనా శరీర భాగంలో గుల్లలు అనగా వాపు ఏర్పడడం, రాత్రిపూట చెమటలు, అలసట లేదా నీరసం, గతంలో ఏమైనా ఆరోగ్య సమస్యలు వచ్చినచో, శరీర ఆరోగ్యంలో ఆకస్మిక మార్పులు ఏర్పడి నచో వెంటనే స్థానిక ఆరోగ్య సిబ్బందిని గాని లేదా ఆరోగ్య కేంద్రాన్ని గాని సంప్రదించి క్షయ వ్యాధి పరీక్షలు చేయించుకోవాలని అన్నారు.
నిక్షయ శిబిరాలను ప్రతి గ్రామంలో నిర్వహిస్తామని ఆ గ్రామంలోని ప్రమాదకర సమూహము (హైరిస్క్ గలవారు) అంటే పూర్వము క్షయ వ్యాధి సోకి తగ్గిన వారు, క్షయ వ్యాధి సోకిన వారి కుటుంబ సభ్యులు, పోషకాహార లోపం గలవారు, మధుమేహం కలవారు, హెచ్ఐవి సోకిన వారు మరియు 60 సంవత్సరముల వయసు పడిన వారందరికి క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తామని అన్నారు.
క్షయ వ్యాధి సోకినవారు ప్రోటీన్ ఎక్కువగా ఉండే పోషకాహారాలు పప్పు దినుసులు, చిక్కుడు, కోడి గుడ్డు ముఖ్యంగా మైసూర్ పప్పు లాంటివి ఆహారంగా తీసుకోవాలని అన్నారు.
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, చైర్మన్, కన్వీనర్ కావేటి రాజగోపాల్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వెంకటేశ్వరరావు మరియు ఎక్స్ క్యూటివ్ మెంబర్, శ్రీ డి.వి.ఎస్ మూర్తి మాట్లాడుతూ గతంలో క్షయ వ్యాధి సోకిన (37) మందికి పోషక ఆహార బాస్కెట్స్ (6) నెలలు అందించామని ఇప్పుడు కూడా సహకరిస్తామని అన్నారు.
డబ్లు. హెచ్. ఓ. కన్సల్టెంట్ డాక్టర్ విష్ణు మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యం క్షయ వ్యాధి నివారణకు అవసరమని మరియు నిక్షయ్ వాహనం తెమడ పరీక్షలను టి-హబ్ కు తరలించుటకు మరియు అవసరమైన వారిని ఎక్స్-రే కేంద్రమునకు తరలించుటకు నిక్షయ వాహన సేవలను వినియోగించుకొని టిబి రహిత సమాజాన్ని నిర్మించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో క్షయ వ్యాధి నిర్ములన ప్రోగ్రాం అధికారి డా. కె. వి. సుధాకర్ రెడ్డి, డిప్యూటీ డి. ఎం. హెచ్. ఓ. లు డా. రవిసింగ్, డా. బి. శ్రీరాములు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, గర్రెపల్లి, వైద్యాధికారి డాక్టర్ అనుదీప్ మరియు సూపర్వైజర్లు, ఏ. ఎన్. ఎం. లు, ఆశాలు మరియు కె.జి.బి.వి. ఒకేషనల్ విద్యార్థులు మరియు ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
