Dr. Anil Kumar performed a rare surgery at Rahul Hospital to remove a 15 kg tumor from his stomach
పెద్దపల్లి జిల్లా
గోదావరిఖని
త్రినేత్రం న్యూస్ (ప్రతినిధి)
వైద్యరంగంలో విశేష సేవలు అందిస్తున్న మేయర్ శ్రీ బంగి అనిల్ కుమార్ ప్రత్యేక అభినందనలు తెలియజేసిన రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్
లక్ష్మీ నగర్ గోదావరిఖనిలోని పేరుగాంచిన ప్రముఖ రాహుల్ హాస్పిటల్ లో గత కొన్ని రోజులుగా Hno :-17-3-442, 45వ డివిజన్,ద్వారకా నగర్, గోదావరిఖనిలో నివసించే వేముల వనజ భర్త రాజయ్య కడుపు నొప్పితో బాధపడుతూ అనారోగ్యంతో సతమతమవుతున్న సందర్భంలో గోదావరిఖనిలోని ప్రముఖ వైద్యశాల రాహుల్ హాస్పిటల్ లో నగర మేయర్ డీర్ . బంగి అనిల్ కుమార్ సంప్రదించిన సందర్భంలో వైద్య పరీక్షల అనంతరం ఈరోజు శ్రీమతి వనజ అనే పేషంట్ అరుదైన శస్త్ర చికిత్స చేసి 15 కిలోల కనితిని కడుపులో నుండి సర్జరీ ద్వారా తీసివేయడం జరిగినది.ఈ సందర్భంగా మేయర్ డాక్టర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ గోదావరిఖని పారిశ్రామిక క్షేత్రంలో గత 50 సంవత్సరాలుగా వైద్యరంగంలో ఇటువంటి అరుదైన శస్త్ర శకిత్స చేయడం ఇదే మొదటి సారి అని పేషంటు వనజ కడుపునొప్పితో తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమయంలో వైద్య పరీక్షల అనంతరం విజయవంతంగా ఇటువంటి అరుదైన చికిత్స చేయడం జరిగినదని. ఈ కనితిని తీసేయడం వల్ల ఆమెకు ప్రాణహాని తప్పినదని, వనజ ఇక ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవని గోదావరిఖని పారిశ్రామిక క్షేత్రంలో వైద్యరంగంలో ఇదొక మైలురాయని గతంలో ఇలాగే కొన్ని శస్త్ర చికిత్సలు జరిపామని సర్జరీ ద్వారా తొలగించామని కానీ ఇది ఇప్పటివరకు జరిపిన శస్త్ర చికిత్సలో కెల్లా అత్యంత అరుదైన శస్త్ర చికిత్స అని ఈ సందర్భంగా బంగి అనిల్ కుమార్ మాట్లాడటం జరిగినది.
రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ మాట్లాడుతూ వైద్య రంగంలో విశేష సేవలందిస్తున్నటువంటి నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని డాక్టర్ అనిల్ కుమార్ వైద్య సేవలు చాలా అమూల్యమైనవని రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలకు విశేష వైద్య సేవలు అందిస్తున్నారని ఇలాంటి అరుదైన శస్త్ర చికిత్సలు మన గోదావరిఖనిలో జరపడం చాలా ఆనందంగా ఉందని రామగుండం పారిశ్రామిక ప్రాంత వైద్య రంగ చరిత్రలో ఇదొక మైలు రాయని మాట్లాడడం జరిగినది.
పేషంటు వనజ బంధువులు అరుదైన శత్ర చికిత్స చేసి 15 కిలోల కనితిని కడుపునుండి తొలగించిన సందర్భంలో మేయర్ డాక్టర్ అనిల్ కుమార్ ధన్యవాదాలు తెలియజేయడం జరిగినది. అలాగే సదరు వైద్యులు కూడా డాక్టర్ అనిల్ కుమార్ అరుదైన శస్త్ర చికిత్స చేసిన సందర్భంలో ప్రత్యేకంగా అభినందనలు తెలియజేయడం జరిగినది. అలాగే అనిల్ కుమార్ ఒకపక్క రాజకీయంగా నగర మేయర్ గా మరోపక్క వైద్యరంగంలో విశేష సేవలందిస్తున్నటువంటి సందర్భంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతమంతా మేయర్ డాక్టర్ అనిల్ కుమార్ అభినందనలు తెలియజేస్తున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App