మొదటి ప్రాధాన్యత ఓటు వేద్దా… పేరాబత్తుల రాజశేఖరాన్ని గెలుపిద్దాం
ఎమ్మెల్యే ఆదిరెడ్డి, పరిశీలకులు బత్తుల, బోళ్ల పిలుపు
47వ డివిజన్‌లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం
Trinethram News : రాజమహేంద్రవరం : మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖరాన్ని అఖండ మెజార్టీతో గెలుపించాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, పరిశీలకులు బత్తుల తాతయ్యబాబు, బోళ్ల వెంకట కృష్ణ ప్రసాద్ పిలుపునిచ్చారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖరానికి మద్దతుగా స్థానిక 47వ డివిజన్‌లో మంగళవారం రాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా సదరు డివిజన్‌లో గ్రాడ్యుయేట్ ఓటర్లను కలిసి తమ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్ధి పేరాబత్తుల రాజశేఖరానికి ఓట్లు వేసి గెలుపించాలని కోరారు. అనంతరం వారు మాట్లాడుతూ రాబోయే పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరానికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వము అధికారం చేపట్టాక రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతోందన్నారు. చంద్రబాబు నాయుడు ఆహ్వానం మేరకు ఎందరో పారిశ్రామికవేత్తలు రాష్ట్రం వైపు చూస్తున్నారని, రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ముందుకు వస్తున్నారని అన్నారు. మేధావి వర్గమైన గ్రాడ్యుయేట్‌లు అందరూ రాజశేఖరానికి మద్దతు తెలపాలని అన్నారు.
రాజశేఖరానికి ఒక్క అవకాశం ఇస్తే పట్టభద్రుల ప్రయోజనాలను కాపాడుతారన్నారు. నిరుద్యోగుల సమస్యలనూ ప్రభుత్వం దృష్టికి పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. ఏడేళ్ల తర్వాత ప్రజా ప్రభుత్వం ప్రకటించిన మెగా డీఎస్సీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లింపులు, వివిధ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. 2023లో టీడీపీ గెలిచిన మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్నే మార్చేశాయన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం ఏ విధంగా అయితే కృషి చేశారో త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా రెట్టింపు స్థాయిలో కృషి చేసి రాజశేఖరానికి విజయం చేకూర్చాలని కోరారు.
అసెంబ్లీ ఎన్నికలకు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు చాలా వ్యత్యాసం ఉంటుందని, ఎమ్మెల్సీ ఎన్నికల బ్యాలెట్ పేపర్లో పార్టీ సింబల్ ఉండదని.. క్రమ సంఖ్యలో నెంబర్లు ఉండి పేర్లు మాత్రమే ఉంటాయని… కూటమి ఎమ్మెల్సీ అభ్యర్ధి పేరాబత్తుల రాజశేఖరం పేరు ఎదురుగా ఉన్న గడిలో 1వ నెంబర్ వేసి ఆయనకు అఖండ విజయం చేకూర్చాలని ఓటర్లను కోరారు. ఈ ఎన్నికల ప్రచారంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App