
రేషన్ కార్డులు ఇవ్వలేని ప్రభుత్వాలు రుణ మంజూరుకు రేషన్ కార్డు తప్పనిసరి చెయడం సిగ్గుచేటు
ఆశజూపి ఆశావహుల నోట్లో మట్టికొడుతున్న ప్రభుత్వం..
స్కీములు, రుణాలు అంటూ ప్రజలను వెర్రివాళ్లను చేయకండి మద్దెల దినేష్
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం అర్హులైన వారందరికీ వర్తింపజేయాలని, షరతులు లేకుండా అర్హులకు రుణాలు ఇవ్వాలని ఫైట్ ఫర్ బెటర్ సోసైటీ నాయకులు మద్దెల దినేష్, గడప శ్రీకాంత్,రేణుకుంట్ల నరేందర్,కొమ్ము చందు యాదవలు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన పథకానికి సంబంధించి ప్రభుత్వం నిబంధనలు సడలించాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రాజీవ్ యువ వికాసం పథకం అనేక నిబంధనలతో కూడుకొని ఉండటం వల్ల చాలామంది నిరుద్యోగులు నష్టపోయే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలను సడలించాలన్నారు. రేషన్ కార్డులు,రాబడి ధృవీకరణ పత్రాలు,బ్యాంకు సూరిటీలు, ఇంటర్వ్యూల విషయంలో సడలింపులు ఇవ్వాలన్నారు.
రేషన్ కార్డులు ఇవ్వలేని ప్రభుత్వాలు తమ పథకాలను ఉపయోగించుకోండి రుణాలు తీసుకోండి వ్యాపారాలు పెట్టుకోండి అని కల్లబొల్లి కబుర్లు చెప్పి నిరుద్యోగ యువతను,ప్రజలను వెర్రివాళ్లనుచేయడం సరైంది కాదని విమర్శించారు.
ఇన్కమ్ సర్టిఫికెట్ ఖచ్చితంగా ఉండాలని నిబంధనల వాళ్ళ తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ సంబంధిత కార్యాలయాల చుట్టూ పడిగాపులు పడుతున్నారని, కావున రేషన్ కార్డులు వార్షిక ఆదాయం ధ్రువీకరణ పత్రాలు ఉండాలని కోరడం జరుగుతుందని అవి లేక సమయానికి అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కావున పధకం పై అనేక ఆంక్షలు సవరించాలని,ఈ పథకం నిర్ణీత రోజులు కాకుండా ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
