Vikram : రాజీవ్ యువ వికాస పథకానికి సిబిల్‌ స్కోర్‌తో ముడిపెట్టొద్దు

TRINETHRAM NEWS

Trinethram News : సంగారెడ్డి : రాజీవ్ యువ వికాస పథకాన్ని సిబిల్ స్కోరు ఆధారంగా అమలు చేయడం వల్ల అసలు లబ్ధి పొందాల్సిన పేద ప్రజలకు అందని ద్రాక్షగా మారుతుందని అంబేడ్కర్ సేన, తెలంగాణ స్టేట్ కో-కన్వినర్ మరియు సోషల్ మీడియా ఇంచార్జ్ విక్రం తెలిపారు. ఇప్పటికే బ్యాంకు బాధితులుగా మారిన ఎంతో మంది పేద కుటుంబాలు గతంలో తీసుకున్న లోన్లు, వాటికి సంబంధించిన చెల్లింపులు కట్టని కారణంగా వారి సిబిల్ స్కోర్ దెబ్బ తిందన్నారు. ఇప్పుడు సిబిల్ స్కోర్‌ను రాజీవ్ యువ వికాస పథకానికి అర్హతగా మారుస్తే, దాదాపు 40 శాతం దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యే ప్రమాదం ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే బ్యాంకు అధికారులతో చర్చించి, సిబిల్ స్కోరు వంటి అడ్డంకులను తొలగించాల్సిన అవసరం ఉంది అని ఆయన పేర్కొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Don't link Rajiv Yuva Vikas

You cannot copy content of this page

Scroll to Top