
Trinethram News : అపరిచిత నంబర్లకు సమాధానం ఇవ్వొద్దని గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి అన్నారు. ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రజలకు అవగాహన కల్పించారు. అంతర్జాతీయ నంబర్ల నుంచి వాట్సాప్ కాల్స్ వస్తే వాటిని వెంటనే బ్లాక్ చేయాలన్నారు. అపరిచితులు అడిగిన డేటాను ఇచ్చిన మీరు విలువైన ధనాన్ని పోగొట్టుకోవద్దని కోరారు. వెంటనే సైబర్ క్రైంలో ఫిర్యాదు చేయాలని లేదా 1930 నంబర్ కు కాల్ చేయాలన్నారు.
