
కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 7: 124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని పి జె ఆర్ నగర్ లో రూ. 2 కోట్ల రూపాయల అంచనావ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులను మరియు రూ.1 కోటి రూపాయల అంచనావ్యయం తో చేపట్టబోయే చిల్డ్రన్ పార్క్ నిర్మాణ పనులను డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఎఇ శ్రావణి తో కలిసి పరిశీలించడం జరిగింది.ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ పీజేఆర్ నగర్ కాలనీలో నిర్మిస్తున్న మల్టి పర్పస్ ఫంక్షన్ హాల్ మరియు చిల్డ్రెన్స్ పార్క్ నిర్మాణ పనులలో భాగంగా ప్రహరీ గోడ మరియు ఫంక్షన్ హల్ బేస్మెంట్ నిర్మాణాలు పూర్తయ్యాయని అన్నారు. ఇప్పుడు బేస్మెంట్ కు పిల్లర్లు నిర్మిసృన్నారని తెలియచేశారు.
పీజేఆర్ నగర్ కాలనీ వాసుల చిరకాల కోరిక త్వరలోనే నెరవేరుతుంది అని, అందరికి ఆమోదయోగ్యమైన ఫంక్షన్ హాల్ ను అన్ని హంగుల తో సకల సౌకర్యాల తో నిర్మిస్తామని కార్పొరేటర్ తెలియచేసారు. ఫంక్షన్ హల్ పేద మధ్య తరగతి ప్రజలకు ఇక్కడి పరిసర ప్రాంత ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుంది అని తెలియచేసారు. ఫంక్షన్ హల్ లో వివాహాది శుభకార్యాలు, సమావేశాలు, సభలు, చిన్న చిన్న ఫంక్షన్ లు జన్మదిన వేడుకలు నిర్వహించుకునేందుకు వీలుగా ఫంక్షన్ హాల్ ఉపయోగపడుతుంది అని అన్నారు. ఫంక్షన్ హాల్ మరియు చిల్డ్రన్ పార్క్ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, నాణ్యత ప్రమాణాలతో చేపట్టి ప్రజలకు త్వరలోనే అందుబాటులో కి తీసుకురావాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పోశెట్టిగౌడ్, శ్యాముల్, మహేష్, ఖలీమ్, సుధాకర్, వర్క్ ఇన్స్పెక్టర్ రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
