
కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ మార్చి 31 : పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా 124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ చౌరస్తాలో గల ఈద్గా లో ముస్లిం సోదరులు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థన కార్యక్రమానికి డివిజిన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ , యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్ తో కలిసి ముఖ్యఅతిధిగా విచ్చేసి ముస్లిం సోదరులతో కలిసి ప్రార్ధనలు నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ రంజాన్ మాసం చాలా పవిత్రమైనది అని, రంజాన్ మాసం సందర్భంగా నిష్ఠతో పాటించే ఉపవాస దీక్షలు, దెైవ ప్రార్థనలతో సామరస్యం, శాంతి సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. డివిజన్ లో ఉన్న ముస్లిం సోదరులందరికి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
