
CPI Ramakrishna : స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దు..సీపీఐ నేత రామకృష్ణ మోదీకి లేఖ!
అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తల మానికంగా నిలిచిన విశాఖ ఉక్కు కార్మాగారాన్ని (స్టీల్ ప్లాంట్ ) ను ప్రైవేటీకరణ చేపట్ట వద్దని కోరారు సీపీఐ నేత రామకృష్ణ. ఈ మేరకు ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ప్రైవేటీకరణ పేరుతో విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్ర మంత్రిత్వ శాఖ కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
స్టీల్ ప్లాంట్ భూములపై ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ కన్నేశాడని అందుకే మోదీ ఆయనకు అనుకూలంగా వ్యవహరించేందుకు విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సీపీఐ రామకృష్ణ.
ఇందుకు సంబంధించి మోదీ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకు వస్తున్నాడని మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ పై ఆధార పడిన వాళ్లు వేల మంది ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమను ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగిస్తూ ఫ్యాక్టరీ పురోభివృద్ధికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగించాలని , ఫ్యాక్టరీ పురోభివృద్దికి చర్యలు తీసుకోవాలని కోరారు సీపీఐ నేత రామకృష్ణ. ఇదిలా ఉండగా జై భారత్ నేషనల్ పార్టీ చీఫ్ జేడీ లక్ష్మీ నారాయణతో పాటు ప్రజా శాంతి పార్టీ చీఫ్ డాక్టర్ కేఏ పాల్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు.
