
యాదాద్రి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. నేషనల్ హెల్త్ మిషన్ స్కీo లో గత మూడు సంవత్సరాల నుండి ప్రైమరీ హెల్త్ సెంటర్ స్థాయిలో ప్రజా నీకానికి వైద్య సేవలు అందిస్తున్న మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ (ఎం.ఎల్. హెచ్ .పి.)లకు రూపాయలు నెలకు 44 వేల వేతనం తోపాటు ఉద్యోగ భద్రతను కల్పించాలని (ఏఐటీయూసీ యాదాద్రి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఇమ్రాన్ ఆధ్వర్యంలో డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్.మనోహర్ వినతిపత్రం ఇవ్వడం జరిగింది.. మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్స్ ఉద్యోగులకు కనీస వేతన చట్టం ప్రకారం జీతాలు అమలు చేయకుండా అతి తక్కువ జీతాలతో విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. డ్యూటీ చార్ట్ ప్రకారం విధులు చేయించకుండా అనేక రకాల క్రింది స్థాయి పనులను వారిపై రుద్దుతూ పని భారాన్ని పెంచటం అన్యాయమని ఆయన తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు.
నర్సింగ్ ఆఫీసర్స్ విద్యార్హతతో, డిస్ట్రిక్ సెలక్షన్ కమిటీ ద్వారా ఎన్నిక చేయబడినటువంటి ఎం.ఎల్.హెచ్.పి. ఉద్యోగులకు కనీస వేతనం రూ.44 వేలు ఇవ్వవలసి ఉండగా కేవలం 29 వేల 900 మాత్రమే జీతం చెల్లిస్తూ అధిక పనిభారాన్ని వారిపై మోపుతూ అన్ని స్థాయిలో పనులు వారితో చేయించుకోవడం అన్యాయమన్నారు.ఇతర రాష్ట్రాలలో ఇస్తున్న మాదిరి మన రాష్ట్రంలో కూడా ఎన్హెచ్ఎంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఐదు శాతం పర్ఫా ర్మెన్స్ బేసిడ్ ఇన్సెంటివ్స్ ఇవ్వాలని , టాబ్స్ , రెంట్, కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు, బిల్స్ ఇవ్వలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరవాధ్యక్షులుగా ఎం.డీ ఇమ్రాన్, ఎం.ఎల్. హెచ్ .పి యాదాద్రి జిల్లా అధ్యక్షురాలు బి.విజయ, ఉపాధ్యక్షులుగా చైతన్య, లావణ్య, ప్రధాన కార్యదర్శి పార్వతి మరియు ఎం. జోష్నా , సహాయ కార్యదర్శి లు అనూష ,అన్నపూర్ణ కోశాధికారిగా జ్యోతి ,మరియు ఎం.ఎల్.హెచ్.పి.లు శిరీష ,దివ్య , పర్ణతి, అశ్విని తదితరులను పాల్గొన్నారు. అనంతరం బిఎఫ్ హెచ్ ఓ డాక్టర్ మనోహర్ ను (ఎం.ఎల్. హెచ్ .పి లు శాలువాతో సన్మానం చేసి పూల మొక్కను ఇవ్వడం జరిగింది
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
