TRINETHRAM NEWS

Trinethram News : హైదరాబాద్‌: తెలంగాణలో 12 ఎంపీ సీట్లు గెలవబోతున్నామని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ధీమా వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో 33 శాతం రిజర్వేషన్‌తో మహిళలకు రాజకీయాల్లో సముచిత స్థానం రాబోతుందని తెలిపారు..

హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన మహిళా మోర్చా కార్యవర్గ సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. మహిళా మోర్చా కార్యాచరణను వివరించారు. రామరాజ్య స్థాపనలో ముందడుగు వేసిన మోదీకి మహిళలంతా అండగా నిలవాలని కోరారు….