
కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 1 : కేపిహెచ్బి డివిజన్ లో రేషన్ షాప్ సన్న బియ్యం పంపిణీ పథకాన్ని కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు తమ్మినేని ప్రవీణ్ కుమార్ ప్రారంభించారు. డివిజన్లోని ఫోర్త్ ఫేస్ రమ్య గ్రౌండ్ లోని రేషన్ షాపుల నందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మక చేపట్టిన సన్న బియ్యాన్ని పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు తమ్మినేని ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి సన్నబియ్యం అందించాలని సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్నబియ్యం పంపిణీ పథకం ప్రారంభించారు అని తెలిపారు. ఈ పథకం ద్వారా శాశ్వతంగా ప్రజల గుండెల్లో నిలిచిపోయేలా ఉంటుందని తెలిపారు.
డివిజన్లోని ప్రజలు స్పందిస్తూ రేవంత్ రెడ్డి ఒక సామాన్య కుటుంబ సభ్యుడిగా ఆలోచించి సన్న బియ్యాన్ని పథకాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలిపారు. దేశంలో చరిత్రాత్మక పధకంగా నిలుస్తుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి మాజీ అధ్యక్షులు షేర్ సతీష్ రెడ్డి, టీపీసీసీ కార్యదర్శి గాలి బాలాజీ మరియు ఉపాధ్యక్షులు అప్పారావు, బి బ్లాక్ సంధ్య, యమునా, వనజ, రేష్మ పచుమల్లి బచ్చు, మళ్ళీ, ఏఎంసీ డైరెక్టర్ ఫణి కుమార్, యూత్ అధ్యక్షుడు రంగస్వామి, రామకృష్ణ, శ్రీధర్ జారీ, గిరి ఎమ్మెల్యే కంటెస్టెంట్ సంజీవరావు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
