పాడేరు బివికె పాఠశాలలో జిల్లా స్థాయి శ్రీ మద్భగవద్గీత పోటీలు.
ఆంధ్రప్రదేశ్, త్రినేత్రంన్యూస్,( పాడేరు ) జిల్లా ఇంచార్జ్ : అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు లో తిరుమల తిరుపతి దేవస్థానం, హిందు ధర్మ ప్రచార పరిషత్, ఆధ్వర్యంలో స్థానిక విజ్ఞాన భారతి ఉన్నత పాఠశాలలో, జిల్లా స్థాయి శ్రీమద్భగవద్గీత శ్లోకాల కంఠస్థ పోటీలు నిర్వహించడం జరిగింది. భగవద్గీత ఆత్మ సంయమ యోగః లోని ఆరవ అధ్యయనంలో ఉన్న నలభైఏడు శ్లోకాలు విద్యార్థులు చెప్పడం జరిగింది ,ఇందులో భాగంగా స్థానిక విజ్ఞాన భారతి విద్యార్థినిలు జూనియర్ విభాగంలో, ప్రథమ స్థానంలో చెట్టి తన్వి శ్రీ నిలవగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో కూడా వరలక్ష్మి , పంపా సీత మహా లక్ష్మీ గెలుపొందడం జరిగింది. సీనియర్ విభాగంలో ప్రథమ స్థానంలో విజ్ఞాన భారతి ఉన్నత పాఠశాల విద్యార్థి, సిఎచ్. హాసిత్ సాయి నిలవగా ద్వితీయ, తృతీయ స్థానాలలో కె. నిహారిక , టి గ్రీష్మ స్థానిక శ్రీ మోదమంబ ఉన్నత పాఠశాల విద్యార్థినిలు గెలుపొందడం జరిగింది . ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ హేమలత హాజరుకావడం జరిగింది.ఆమె మాట్లాడుతూ చిన్నతనం లొనే శ్లోకాలు నేర్చుకున్నారంటే మీరు చాలా పెద్ద స్థాయికి చేరుకుంటారని, భగవద్గీత గీత మన జీవితంలో చాలా ఉపయోగకరమైనది విద్యార్థులకు ఉద్దేశించి మాట్లాడం జరిగింది. గౌరవ అతిధులుగా కొట్టగొల్లి సింహాచలం నాయుడు (ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్-హుకుంపేట), టి. బాబురావు పాఠశాల కరెస్పాండంట్ , బి.వెంకట రత్నం, పాఠశాల డెవలప్మెంట్ సభ్యులు, ఎం. కాంతి కుమారి, క్లస్టర్ మేనేజర్ విశాఖపట్నం సి.ఎచ్ సత్యనారాయణ, టీటీడీ ప్రోగ్రాం అసిస్టెంట్, ఎమ్. నాగేంద్ర, భగదియం హిందు ధర్మ, బి.నరసింహ మూర్తి,ధర్మచర్య , ప్రధానాచార్యులు ఎం. రవికుమార్, విద్యార్థిని విద్యార్థులు ,పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App