TRINETHRAM NEWS

వాలంటీర్ల రిలే దీక్షకు సంఘీభావం తెలుపుతూ, వాళ్ళల్లొ ఆత్మ స్థైరాన్ని నింపిన ఆదివాసి గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాల్ దేవ్ ప్రసంగం.

ఆంధ్రప్రదేశ్: అరకులోయ త్రినేత్రం న్యూస్ డిసెంబర్.28

రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో వాలంటీర్ లకు ఇచ్చిన హామీలు అమలు చేసి వాలంటీర్ వ్యవస్థను యధావిధిగా కొనసాగించాలని, కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యి 6 నెలలు పూర్తి కావస్తున్న వాలంటీర్ల పై ఎటువంటి నిర్ణయం తీసుకోక పోవడం చాలా దారుణమని, అదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్, మండల కార్యదర్శి జి బుజ్జిబాబు, సిఐటియు ఆధ్వర్యంలో వాలింటర్లు నిర్వహిస్తున్న ఆవేదన దీక్షాకు మద్దతుగా పాల్గొని మాట్లాడారు.
గతంలో వైసీపీ ప్రభుత్వం నెలకు 12 వేలు వేతనం ఇస్తామని చెప్పి మోసం చేస్తే, ఈ రోజు కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో వాలంటీర్ లకు 10 వేలు వేతనం ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పి అధికారంలో వచ్చి 6 నెలలు పూర్తి కావస్తున్న వాలంటీర్ వ్యవస్థ కొన సాగింపు పై నిర్ణయం తీసుకోకుండా మోసం చేస్తుందని,
ఏ ప్రభుత్వం వచ్చిన వాలంటీర్ లను మోసం చేయడమే తప్ప వాళ్ళ కు ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనం చెల్లించాలనే ఆలోచన లేదని, అందుకు వాలంటీర్ లు ఐక్యంగా గతంలో ఆశ అంగన్వాడిలు తమ డిమాండ్లు నెరవేర్చుకొనుటకు ఏ విదంగా పోరాటం చేశారో ఆ విదంగా పోరాటనికి సిద్ధం కావాలని, వాలంటీర్ ల న్యాయమైన డిమాండ్ ల సాధించు కోవడానికి చేస్తున్న పోరాటానికి, ఆదివాసీ గిరిజన సంఘం అండగ ఉంటుంది.ఈ కార్యక్రమంలో వాలంటీర్ యూనియన్ నాయకులు ఆనంద్ శాంతి కుమార్ వర్మ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App