TRINETHRAM NEWS

పెద్దపల్లి , మార్చి- 26// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. జిల్లాలో నేడు జరిగిన గణిత పరీక్షకు 99.89% మంది విద్యార్థులు హాజరయ్యారని జిల్లా విద్యాశాఖ అధికారి డి మాధవి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు గణితం పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని, ఎక్కడ ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు బుక్ కాలేదని అన్నారు. 3 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు 16 సెంటర్లను, జిల్లా లెవెల్ అబ్జర్వర్ 7 పరీక్ష కేంద్రాలు, అసిస్టెంట్ కమిషనర్ పరీక్షల విభాగం 2 సెంటర్లను, జిల్లా విద్యాశాఖ అధికారి 4 పరీక్షా కేంద్రాలను సందర్శించారని తెలిపారు.

ఆంగ్ల పరీక్షకు 7393 మంది విద్యార్థులు హాజరు కావల్సి ఉండగా 7385 మంది విద్యార్థులు హాజరయ్యారని, మొత్తం 99.98% హాజరు శాతం ఉందని, పరీక్షలు సజావుగా జరిగాయని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని జిల్లా విద్యాశాఖ అధికారి ఆ ప్రకటనలో పేర్కొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

District Education Officer D