ఆసుపత్రిలో రోగులకు అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలి
పెద్దపల్లి, ఫిబ్రవరి-03: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రి లోకి వచ్చే రోగులకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.
సోమవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిని, రంగంపల్లి లోని మైనారిటీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి లోని ఆయుష్మాన్ భారత్ ఓపి రిజిస్ట్రేషన్, నూతనంగా నిర్మించే ఆసుపత్రి భవనాన్ని, కూల్చివేతకు సిద్ధంగా ఉన్న మూడు వార్డులను, డయాలసిస్ జరుగుతున్న మిషనరీలను, స్కానింగ్ ఓపి రూములను కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, ఆఫ్టల్ ఓపి సర్జరీలు బాగానే జరుగుతున్నాయని ఇవి కాకుండా ఇంకా సర్జరీలు పెరగాలని,కొత్తగా నిర్మించే ఆసుపత్రి బిల్డింగ్ పూర్తి అయ్యే లోపు ప్రస్తుతం ఉన్న వార్డులను తీసివేసే క్రమంలో వాటిని ఎక్కడికి మార్చాలో వాటిపై వెంటనే సంబంధిత ఇంజనీరింగ్ శాఖ అధికారులతో మాట్లాడి సాయింత్రం సమావేశం ఏర్పాటు చేయాలని ,వాటిలో బిల్డింగ్ కు సంబంధించిన వివరాలు మరియు కూల్చి వేతకు సిద్ధంగా ఉన్న వార్డుల సంబంధిత సమాచారం తీసుకు రావాలని కలెక్టర్ తెలిపారు. మాతా శిశు ఆసుపత్రిలోని ఓపి ఛాంబర్ ఆపరేషన్ థియేటర్ ,జనరల్ వార్డు ఆర్తో, ఆఫ్టల్, తదితర వార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు
అనంతరం రంగంపల్లిలోని మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ ను పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. వసతులపై సానుకూలంగా స్పందించారు . విద్యార్థులతో చిట్-చాట్ చేశారు. X గ్రేడ్ విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యారు. మరియు 40 మంది విద్యార్థులు 9+ GPA కంటే ఎక్కువ గ్రేడ్‌లను పొందాలని, అన్ని తరగతుల వసతి గృహాలను తనిఖీ చేశారు . మరియు మెడిసిన్ & సోర్స్ ఆఫ్ మెడిసిన్ గురించి అడిగి తెలుసుకున్నారు. స్టోర్ వస్తువులను కూడా తనిఖీ చేసారు. వంటగది సిబ్బందిని విచారించారు.
జిల్లా కలెక్టర్ వెంట ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ శ్రీధర్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గోన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App