జిల్లా లో బ్యాంక్ లింకేజి , శ్రీనిధి రుణాల పంపిణి త్వరితగతిన పూర్తి చేయాలనీ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్
శుక్రవారం కల్లెక్టరేట్ కాన్ఫరెన్సు హాలు నందు గ్రామీణ అభివ్రుది అధికారి అధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశం లో అయన మాట్లాడుతూ మహిళా సంఘాలు లోను భీమా ను వినియోగించుకోవాలని తెలిపారు. 60 సంవత్సరాల లోపు ఉన్న మహిళ సంఘ సబ్యులు తీసుకున్న బ్యాంక్ రుణాలకు ప్రభుత్వం తేది 14-03-2024 నుండి ఉచిత లోను సౌకర్యం కల్పించిందని, మరియు ప్రమాద భీమా పథకాన్ని అమలు చేస్తుందని అయన తెలిపారు. లోను భీమా తీసుకున్న సబ్యురాలు చనిపోతే ఆమె యొక్క లోను కు సంబంధించిన దృవీకరణ పత్రాలు మండల సమైఖ్య లో సమర్పించి లబ్ది పొందాలని అయన సూచించారు.
జిల్లాలో బ్యాంకు లింకేజి ద్వారా అర్హత కలిగిన సంఘాలకు టార్గెట్ ప్రకారం రుణాలను అందించాలని, జిల్లా లక్ష్యాలను సాధించాలని ఆన్నారు జిల్లాలో మహిళా సమాఖ్య సంఘాలకు బ్యాంకు లింకేజి, శ్రీనిధి ద్వారా అర్హత కలిగిన సంఘాలకు రుణాలను టార్గెట్ ప్రకారం రుణాలను పంపిణీ.లక్ష్యానికి అనుగుణంగా పంపిణీ చేయాలని తెలిపారు. అదే విధంగా రుణాల పంపిణీ తో పాటు రికవరీ వంద శాతం పూర్తి చేయాలని తెలిపారు. ప్రతి వారము గ్రామీణ అభివృది అధికారి అధ్వర్యంలో క్షేత్ర స్థాయి సిబ్బందితో సమీక్షించాలని, రికవరుల పై ప్రత్యేక శ్రద్ధ కనబరాచాలని తెలిపారు. లోన్లు తీసుకునేటప్పుడు ఏవైనా సమస్యలు ఏర్పడితే అధికారి దృష్టికి తీసుకురావాలని, క్లెయిమ్ లకు సంబంధించిన రిపోర్ట్ సబ్మిట్ చేయాలనీ ఆదేశించారు. లోన్ల పై అందరికి అర్థమయ్యేటట్లు చెప్పి, బ్యాంక్ లింకేజి రికవరీ లు 100 శాతం పూర్తి అయ్యేటట్లు చూడాలన్నారు. టూవీలర్ పైన మొబైల్ క్యాంటీన్ , బ్రౌన్ రైసు, మిల్లెట్స్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లా గ్రామీణ అభివృధి అధికారి శ్రీనివాస్ , అదనపు పి డి సరోజ, శ్రీనిధి ఆర్ ఎం ఉదయకుమారి ,డి పి ఎం లు , ఎ పి ఎం లు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App