విద్యార్థులు క్రీడలతో పాటు విద్య లో ను ముందుండాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్
బుధవారం వికారాబాద్ జిల్లాలోని శివ రెడ్డి పేట (అనంతగిరిపల్లి) సాంఘిక సంక్షేమ గురుకుల బాలల పాఠశాల/కళాశాల ఆవరణలో 10 వ జోనల్ స్థాయి పోటీలలో పాల్గొనే క్రీడాకారులతో మాట్లాడారు . వివిధ పాఠశాలల విద్యార్థులు మార్చ్ ఫాస్ట్ ద్వారా కలెక్టర్ గారికి స్వాగతం పలికారు. ఈ సందర్బంగా కలెక్టర్ క్రీడాకారులతో మాట్లాడుతూ విద్యార్థులు క్రీడలతో పాటు చదువులో ముందుండాలని, క్రీడల వల్ల శారీరక దృఢత్వం తో పాటుమానసికంగాబలపడతారని అన్నారు. క్రీడా పోటీల్లో పాల్గొనే విద్యార్థులు గెలుపొంది జిల్లా కు మంచి పేరు తీసుకురావాలని , విద్యార్థులు క్రీడల పట్ల ఆసక్తిని పెంచుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలాన్నారు. క్రీడల్లో తమనైపుణ్యాన్నిపెంపొందించుకోవాలని ఆయన సూచించారు. క్రీడల్లో రాణించినట్లయితే ఉద్యోగల్లో ప్రాధాన్యత కల్పించడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో తాండూర్ సబ్ కలెక్టర్ఉమాశంకర్ ప్రసాద్ ,సాంఘిక సంక్షేమ గురుకుల బాలల పాఠశాల/కళాశాల కళాశాల ప్రిన్సిపల్ రమాదేవి, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల సాంఘికసంక్షేమగురుకుల బాలల పాఠశాల ల విద్యార్థులు వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App