
ఫిబ్రవరి 4న విద్య కమిషన్ ప్రజా అభిప్రాయ సేకరణ జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
పెద్దపల్లి, ఫిబ్రవరి -01: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, ఫిబ్రవరి 4న మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్లో తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ చే రాష్ట్ర నూతన విద్య పాలసీ రూపకల్పన పై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర రాష్ట్ర విద్యా పాలసీ రూపకల్పన కోసం విద్యా కమిషన్ కు బాధ్యతలు అప్పగించిందని, ఇందులో భాగంగా తెలంగాణ విద్యా కమిషన్ జిల్లాలో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాలు నిర్వహిస్తుందని అన్నారు.
మన పెద్దపల్లి జిల్లాలో సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశం మందిరం నందు ఫిబ్రవరి 4న ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు తెలంగాణ విద్యా కమిషన్ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం జరుగుతుందని అన్నారు.
ప్రజాభిప్రాయ కార్యక్రమంలో టీచర్లు, జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ ప్రొఫెసర్, ఇంజనీరింగ్ కళాశాల పిజి కళాశాలల అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు , విద్యా నిపుణులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని తమ అభిప్రాయాలను విద్యా కమిషన్ కు తెలియజేయాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
