District Collector Koya Harsha took strong measures to prevent illegal sand transport
*పెండింగ్ ధరణి దరఖాస్తులను పరిష్కరించాలి
*ఐబీ అతిథి గృహం ఆధునీకరణ పనులు నెల రోజులలో పూర్తి చేయాలి
*మంథనిలో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్
మంథని, జూలై-31: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
మండలంలో అక్రమ ఇసుక రవాణాకు పట్టిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ హర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు.
బుధవారం జిల్లా కలెక్టర్ కోయ హర్ష మంథని మండలంలోని వెంకటాపూర్ ,అడవి సోమనపల్లి గ్రామాలలో ఉన్న ఇసుక రీచ్ లను, మంథని పట్టణంలోని తహసిల్దార్ కార్యాలయాన్ని, పురపాలక శాఖ కార్యాలయాన్ని, డిప్యూటీ ఇంజనీర్ పంచాయతీరాజ్ శాఖ కార్యాలయాన్ని, ఐబీ అతిథీ గృహాన్ని పరిశీలించారు.
మండలంలోని ఇసుక రీచ్ ల వద్ద కట్టిన ట్రెంచ్ లను కలెక్టర్ పరిశీలించి అక్రమ ఇసుక రవాణా నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
పంచాయతీరాజ్ డిప్యూటీ ఇంజనీర్ కార్యాలయం ఆవరణను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీటి నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. మండలంలో పెండింగ్లో ఉన్న ధరణి దరఖాస్తులను పరిష్కరించాలని తహసిల్దార్ కార్యాలయం ఆధునికరణ కు ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ సూచించారు.
ఐబి అతిథి గృహంలో రిన్నోవేషన్ పనులను పరిశీలించిన కలెక్టర్ పెండింగ్ పనులు నెల రోజుల వ్యవధిలో పూర్తి చేయాలని సంబంధిత ఏజెన్సీలను ఆదేశించారు మంథని పట్టణంలోని పురపాలక కార్యాలయాన్ని పరిశీలించిన కలెక్టర్ తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ క్రింద ప్రతిపాదించిన అభివృద్ధి పనులపై రివ్యూ నిర్వహించారు.
మంత్రి సూచనల మేరకు మంథని పట్టణంలో నూతన పురపాలక కార్యాలయం, వెజ్ ,నాన్ వెజ్ మార్కెట్, డంపింగ్ యార్డ్ నిర్మాణానికి సంబంధించి అనుమతులు డి.టి.సి.పి (డైరెక్టర్ టౌన్ ప్లానింగ్ & కంట్రీ ప్లానింగ్) నుంచి త్వరితగతిన సాధించాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ఈ తనీఖీలలో జిల్లా కలెక్టర్ వెంట మున్సిపల్ చైర్ పర్సన్ రమా దేవి, మంథని రెవెన్యూ డివిజన్ అధికారి వి.హనుమాన్ నాయక్, తహసిల్దార్ రాజయ్య, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున స్వామి, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App