District Collector Koya Harsha should strengthen the school communities
*ప్రతి నెల పాఠశాల సముదాయాల సమావేశాలు నిర్వహించాలి
పాఠశాల సముదాయాల పనితీరు మెరుగుపరచడం పై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించిన జిల్లా కలెక్టర్
పెద్దపల్లి, ఆగస్టు -07 : త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
జిల్లాలో ఉన్న 36 పాఠశాల సముదాయాలను బలోపేతం చేయాలని, పాఠశాల సముదాయాల్లోని పాఠశాలల పనితీరు మెరుగుపరిచే దిశగా కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ కోయ హర్ష అన్నారు.
బుధవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లో పాఠశాల సముదాయాల పనితీరు మెరుగుపరచడం పై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ హర్ష మాట్లాడుతూ, పాఠశాల సముదాయాల ప్రధానోపాధ్యాయులు వారి పరిధిలో ఉన్న ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లోనే విద్యార్థుల అభ్యాసన సామర్ధ్యాలను మెరుగుపరిచేందుకు కృషి చేయాలని కలెక్టర్ సూచించారు.
పాఠశాలల్లోనే విద్యార్థుల అభ్యాసన సామర్థ్యం మేరకు ఉపాధ్యాయులు పాఠ్యాంశాలు బోధించే విధంగా అవసరమైన సలహాలు సూచనలు అందజేయాలని, పాఠశాల సముదాయం ప్రధానోపాధ్యాయులు వారి పరిధిలోని పాఠశాలలను సందర్శిస్తూ అక్కడ విద్యాబోధనను పరిశీలించాలని కలెక్టర్ పేర్కొన్నారు.
ప్రతి నెల పాఠశాల సముదాయం పరిధిలోని పాఠశాలల పని తీరు పై రివ్యూ సమావేశం నిర్వహించుకోవాలని,
ఈ సమావేశాల్లో విద్యార్థుల అభ్యాసన సామర్ధ్యాలను అంచనా వేస్తూ ఎప్పటికప్పుడు నూతన లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధనకు కృషి చేయాలని కలెక్టర్ సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి డి మాధవి, జిల్లా అకాడమిక్ మోనిటరింగ్ అధికారి పీఎం షైక్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, పెద్దపల్లి చే జారీ చేయనైనది
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App