TRINETHRAM NEWS

District Collector Koya Harsha should prevent violence against girls and women and support them

పెద్దపల్లి , జూలై -8: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

బాలికలు, స్త్రీలపై జరిగే హింస నివారణకు మనమంతా కృషి చేసి వారికి అండగా ఉండాలని జిల్లా కలెక్టర్ కోయ హర్ష అన్నారు.

సోమవారం జిల్లా కలెక్టర్ కోయ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో స్త్రీలపై హింస నివారణకు, మహిళా సంరక్షణ చట్టాలు తెలుపుతూ మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ద్వారా రూపొందించిన పలు పోస్టర్లను అదనపు కలెక్టర్ లు జే.అరుణశ్రీ, జి.వి. శ్యామ్ ప్రసాద్ లాల్ లతో కలిసి ఆవిష్కరించారు.

ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ కోయ హర్ష మాట్లాడుతో మహిళలకు ఫోన్ ద్వారా సలహాలను, సహాయాన్ని అందించుటకు మహిళా హెల్ప్ లైన్ నెంబర్ 181 అందుబాటులో ఉన్నదని, గృహహింస, వరకట్న వేధింపులు, పనిచేసే చోట వేధింపులు, లైంగిక హింస, ఆడపిల్లల అమ్మకం, రవాణా నివారణ కోసం మహిళా హెల్ప్ లైన్ నెంబర్ 181 కు ఫోన్ చేయాలని, మహిళలకు అవసరమైన సలహా, కౌన్సిలింగ్, రక్షణ చర్యలు తీసుకోబడతాయని కలెక్టర్ తెలిపారు.

సఖీ కేంద్రం ద్వారా మహిళలకు వైద్య సేవలు, పోలీస్ సహాయం, న్యాయ సహాయం, తాత్కాలిక వసతి, కౌన్సెలింగ్ అందించడం జరుగుతుందని అన్నారు. బాలికలు, స్త్రీలపై జరిగే హింసను నివారించి వారికి అండగా ఉండాల్సిన బాధ్యత మనందరిపై ఉందని కలెక్టర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్, జిల్లా అధికారులు, సఖీ సెంటర్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గోన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, పెద్దపల్లిచే జారీ చేయనైనది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

District Collector Koya Harsha should prevent violence against girls and women and support them