విజ్ఞాన సందర్శనలతో విద్యార్థులకు మేలు జిల్లా కలెక్టర్ కోయ హర్ష
*భవిష్యత్తులో మరిన్ని విజ్ఞాన సందర్శనల నిర్వహణకు ప్రణాళిక
*విజ్ఞాన సందర్శనకు వెళ్లి వచ్చిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులతో ముచ్చటించిన జిల్లా కలెక్టర్
పెద్దపల్లి, నవంబర్ -16:- త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
విజ్ఞాన సందర్శనలు విద్యార్థులకు మేలు చేస్తాయని, కొత్త అంశాలను ఆలోచించడం నేర్చుకోవడం పట్ల పిల్లల ఆసక్తి పెరుగుతుందని జిల్లా కలెక్టర్ కోయ హర్ష అన్నారు.
శనివారం జిల్లా కలెక్టర్ కోయ హర్ష పెద్దపల్లి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ను సందర్శించి విజ్ఞాన సందర్శనకు వెళ్లిన పిల్లలతో ముచ్చటించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ హర్ష టీ- హబ్, టీ వర్క్స్ లను సందర్శించిన పిల్లలతో వారి అనుభవాలను, నేర్చుకున్న నూతన విషయాలను అడిగి తెలుసుకున్నారు. విజ్ఞాన సందర్శన తమలో నూతన ఆవిష్కరణలు చేయాలని కోరికను పెంచిందని విద్యార్థులు తెలియజేశారు.
విద్యార్థులను జిల్లా కలెక్టర్ అభినందిస్తూ భవిష్యత్తులోనూ మరిన్ని విజ్ఞాన సందర్శనలను ఏర్పాటు చేయడం జరుగుతుందని, వీటిని పూర్తిస్థాయిలో ఉపయోగించుకుంటూ పరిజ్ఞానాన్ని విద్యార్థులు పెంచుకోవాలని కలెక్టర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో ఇంచార్జి ప్రధాన ఉపాధ్యాయులు కే.సురేంద్ర ప్రసాద్, టీచర్లు లక్ష్మణ్ ,మంజుల రవి, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App