TRINETHRAM NEWS

పెద్దపల్లి, ఫిబ్రవరి-13: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. బాలల సమస్యలపై ఫిర్యాదులు అందించేందుకు 1098 ఫోన్ నెంబర్ కు ఫోన్ చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లో బాలల సంరక్షణ చర్యల పై సంబంధిత మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ జిల్లాలో ఉన్న అనాథ పిల్లలు, సెమీ ఆర్ఫన్ పిల్లలో స్పాన్సర్షిప్ కు అర్హులైన పిల్లలను గుర్తించి వారి వివరాలు సేకరించాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో ఎక్కడ బాల్య వివాహాలు జరగకుండా సంబంధిత అధికారులు సమన్వయం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.

జిల్లాలో ఎక్కడ చట్ట వ్యతిరేక దత్తతలు జరగకుండా సంబంధిత ఆసుపత్రి సూపరింటెండెంట్ లతో సమన్వయం చేసుకోవాలని, గ్రామీణ బాలల పరిరక్షణ కమిటీలకు అవసరమైన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు. బాలల పై జరిగే లైంగిక దాడులను నివారించేందుకు సంబంధిత వ్యవస్థలతో సమయం చేసుకుని పని చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

బాల కార్మికులు లేని జిల్లాగా పెద్దపల్లిని తీర్చిదిద్దాలని ఇటుక బట్టీ లలో పని చేసే పిల్లలు గుర్తించి వారికి విద్య అదే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. పిల్లల ద్వారా జరిగే భిక్షాటన వివరాలు, బాల్య వివాహాలు, బాల కార్మికులు ఎక్కడైనా కనబడితే 1098 కు ఫోన్ చేసి వివరాలు అందించాలని అన్నారు.అనాధ పిల్లలను బాల సదనంలో చేర్పించ వచ్చని కలెక్టర్ తెలిపారు.

ఈ సమావేశంలో జిల్లా బాలల పరిరక్షణ అధికారి కమలాకర్, చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ ఉమాదేవి, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Collector Koya Sri Harsha
Collector Koya Sri Harsha