TRINETHRAM NEWS

కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని భార్గవి సర్వీస్ స్టేషన్ ను సీజ్ చేసిన అధికారులు
కాల్వ శ్రీరాంపూర్, మార్చి -24// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

సోమవారం జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి రాజేందర్ కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని భార్గవి సర్వీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ నిర్వహించి లైసెన్సు లేని కారణంగా సీజ్ చేయడం జరిగింది
ఈ సందర్భంగా జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి రాజేందర్ మాట్లాడుతూ, తనిఖీలలో భార్గవి సర్వీస్ స్టేషన్ (యజమాని వి.రమేష్ ) ఫారం బీ లైసెన్స్ లేకుండానే వ్యాపారం చేస్తున్నట్లు గమనించి సీజ్ చేశామని అన్నారు. పెట్రోల్ బంక్ లో 20 లక్షల 37 వేల 248 రూపాయల విలువ గల ఉన్న 9992 లీటర్ల పెట్రోల్, 10,022 లీటర్ల డీజిల్ లను కూడా సీజ్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు
ఈ తనిఖీలలో డిప్యూటీ తహసిల్దారులు సంతోష్ సింగ్ ఠాకూర్ రవీందర్,సంబంధిత అధికారులు, తదితరులు జిల్లా పౌర సరఫరాల అధికారి వెంట ఉన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

District Civil Supplies Department