Trinethram News : గద్వాల కలెక్టరెట్:-మహిళలలు అన్ని రంగాలలో అంకితభవంతో పనిచేస్తారని, వారికి సముచిత స్థానం కల్పించడంలో ముందుంటామని జిల్లా అదనపు కలెక్టర్ అపూర్వ చౌహన్ అన్నారు. మంగళవారం ఐ.డి.ఓ.సి సమావేశం హాల్ నందు మహిళా, శిశు, అభివృద్ధి, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలలో జిల్లా అదనపు కలెక్టర్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కేక్ కట్ చేశారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2024 యొక్క ప్రధాన థీమ్ ‘మహిళల స్వయం ఉపాధికి పెట్టుబడి పెట్టండి వారి అభివృద్ధిని వేగవంతం చేద్దాం’. ఈ థీమ్ ఆధారంగా కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. అన్ని రంగాల్లో పురుషులకంటే మహిళలు ముఖ్యపాత్ర పోషిస్తున్నానన్నారు. మహిళా నిపుణులు వివిధ రంగాలలో తమ ప్రతిభను చాటి సమాజానికి మేలు చేయాలన్నారు. ఎన్నికల సమయంలోనూ మహిళలు ఎంతో చక్కగా పని చేశారని అన్నారు.
అనంతరం జిల్లా మహిళా అధికారులు ఐ.డి.ఓ.సి ఆవరణలో బెలున్స్ ఎగురవేశారు ,విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి మరియు వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న అధికారిణిలకు మెమొంటోలు అందజేయడం జరిగింది. జిల్లాలోని కళాశాలల విద్యార్థినులకు అనీమియా పరీక్షలను ఐ.డి.ఓ.సి నందు బాలికలకు అనేమియా పరీక్షలు నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జెడ్పి సి.ఈ.ఓ కాంతమ్మ , ఎంప్లాయిమెంట్ అధికారి ప్రియాంక ,డీడబ్ల్యూవో ఇంచార్జ్ సుధారాణి ,వెనకబడిన జిల్లా సంక్షేమాధికారి సరోజ ,ఆర్ అండ్ బి ప్రగతి, మత్స్యశాఖ అధికారి షకీలా భాను , మహిళా అధికారిణీలు, మహిళలు, విద్యార్థినిలు పాల్గొన్నారు…
మహిళా దినోత్సవ వేడుకల్లో జిల్లా అదనపు కలెక్టర్
Related Posts
ప్రభుత్వం అంటే నిర్మాణం చేయాలి.. సమాజాన్ని నిలబెట్టాలి: KCR
TRINETHRAM NEWS ప్రభుత్వం అంటే నిర్మాణం చేయాలి.. సమాజాన్ని నిలబెట్టాలి: KCR Trinethram News : Telangana : Nov 09, 2024, ప్రభుత్వం అంటే నిర్మాణం చేయాలని.. సమాజాన్ని నిలబెట్టాలని BRS అధినేత కేసీఆర్ అన్నారు. ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌లో పాలకుర్తి…
Harish Rao : ఇవాళ 30 శాతం వడ్లు దళారుల పాలైంది
TRINETHRAM NEWS ఇవాళ 30 శాతం వడ్లు దళారుల పాలైంది Trinethram News : Telangana : ఈ ప్రభుత్వం కొనడం లేదని రూ.1700, 1800 ధాన్యం దాళరులకు అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది రూ.2320 మద్దతు ధర, రూ.500 బోనస్ మొత్తం…