TRINETHRAM NEWS

ఇందిరమ్మ మహిళా శక్తి పథకం ద్వారా కుట్టు మిషన్లు పంపిణీ

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ తెలంగాణ ప్రభుత్వం జిల్లా మైనారిటీ సంక్షేమ కార్యాలయము వికారాబాద్ జిల్లా తెలంగాణ క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ వారు ఇందిరమ్మ మహిళా శక్తి పథకం ద్వార ఉచిత కుట్టు మిషన్ లు అందిస్తున్నట్లు జిల్లా మైనారిటీ అధికారి,కే.హన్మంత్ రావు ఒక ప్రకటనలోతెలిపారు. ఆసక్తిగా ఉన్న క్రిస్టియన్ మైనారిటీ మహిళలు జనవరి 20 లోపుఆన్లైన్ TGOBMMS web: tgobmms.cgg.gov.in ద్వార దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. తెల్ల రేషన్ కార్డు లేదా ఆహార బద్రత కార్డ్ లేదా గ్రామీణ వారికి 1.50 లక్షలు మరియు పట్టణ ప్రాంతం వారికి 2.00 లక్షలు మించకుండ ఆదాయం ఉండాలని తెలిపారు. కనీసం 5వ తరగతి విద్య అర్హత కలిగి ఉండాలని తెలిపారు. 18 నుండి 55 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలన్నారు.
తెలంగాణ క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ లేదా ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పొందిన సమస్త ద్వార నేర్చుకున్న టైలర్ ధ్రువీకరణ పత్రము, ఆదార్ కార్డు కలిగి ఉండాలని ఆయన తెలిపారు.
మరిన్ని వివరాలకు మొబైల్ నెంబర్ 7993357103

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App