TRINETHRAM NEWS

దుర్గానగర్ లే అవుట్ కాలనీ ఆధ్వర్యంలో మహిళలకు చీరలు పంపిణీ

సీనియర్ సిటిజన్స్ పెద్దలకు గీట్ల దామోదర్ రెడ్డి, మంతిని రాజయ్య, బాలసాని రాజయ్య, పంజాల రాజకొమురయ్య సత్కారం

జాతీయ పతాకావిష్కరణ

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

76వ ఘనతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దుర్గానగర్ లే-అవుట్ కాలనీ లో ఆదివారం ఎర్పాటు చేసిన కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు తూముల రాజేశ్వర్ రావు జాతీయ జెండాను
ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ సలహాదారులు సింగరేణి శీనన్న ముఖ్యఅతిథిగా హాజరైనారు. గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని అధ్యక్షుడు రాజేశ్వర్ రావు మాట్లాడుతూ, మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మనము బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. ఈ రాజ్యాంగంలో ప్రజల హక్కులు, విధులు, స్వేచ్ఛ, సమానత్వం మరియు సౌబ్రాతృత్వం మొదలైనటువంటివి లిఖించబడ్డాయని పేర్కోన్నారు. దానికనుగుణంగానే లే-అవుట్ కాలనీవాసులు కాలనీ అభివృద్ధి కోసం కృషిచేస్తున్నారని, అందరూ సహకరించవలసిందిగా కోరారు. అదేవిధంగా కాలనీ పెద్ద మనుషులను అతిదులచే సన్మానించడం జరిగింది. పేద స్త్రీలకు చీర, జాకెట్లు పంపిణీ చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో జక్కుల నారాయణ ప్రధాన కార్యదర్శి, పోకల ఆంజనేయులు కోశాధికారి, ఉపాధ్యక్షులు చందా రాజేశ్వర్ రావు, దేవేందర్ రెడ్డి, సలహాదారులు మంతిని సంపత్, బాలసాని స్వామి గౌడ్, తూముల అశోక్ రావు, మాజీ అధ్యక్షులు బుచ్చిరెడ్డి, మహిళలు తూముల రమాదేవి, జక్కుల ఈశ్వరి,రేఖ అమరేందర్ బాలసాని పద్మ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App