ఆడబిడ్డలకు చీరల పంపిణీ అభినందనీయం….
దాతలు సాంబశివరెడ్డి, నరేష్ సేవలు మరువలేనివి…
మహిళా పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వం…
రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకులు ధనసరి సూర్య…
ఘనంగా నిర్వహించిన “సంక్రాంతి కానుక “” కార్యక్రమం…
ఆడబిడ్డలకు చీరల పంపిణీ అభినందనీయమని పీసీసీ రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకులు ధనసరి సూర్య అన్నారు శనివారం మండలంలోని అకినేపల్లి మల్లారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ మిర్చి టాస్క్ పోర్స్ డైరెక్టర్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు నాసిరెడ్డి సాంబశివరెడ్డి అధ్యక్షతన జరిగిన చీరల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ & స్త్రీ శిశు సంక్షేమ శాఖ మాత్యులు శ్రీమతి ధనసరి సీతక్క కుమారుడు రాష్ట్ర యువజన కాంగ్రెస్ సెక్రటరీ ధనసరి సూర్య గారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంతోనే మహిళా సాధికారత సాధ్యమని అధికారంలోకి వచ్చిన మొదటి వారంలోనే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు సంక్రాంతి పర్వదినం సందర్భంగా జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకులు నాసిరెడ్డి సాంబశివరెడ్డి తన స్నేహితుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు పచ్చిపులుసు నరేష్ మహిళలకు చీరలను బహుకరించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు సాంబశివరెడ్డి నరేష్ సేవలు మరువలేని అన్నారు అకినేపల్లి మల్లారం గ్రామ మహిళలు మరియు ప్రజల కోసం వరంగల్ రెండు డిపో నుండి ఆర్టిసి బస్సు సర్వీస్ ఏర్పాటు చేస్తామని సూర్యప్రకటించారు గ్రామంలో నూతన రహదారుల ఏర్పాటుకు నిధులు మంజూరు చేయించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు అనంతరం నాసిరెడ్డి సాంబశివ రెడ్డి మాట్లాడుతూ సీతక్క సారధ్యంలో ములుగు జిల్లా ప్రగతి పథంలో దూసుకుపోతుందని సీతక్క జిల్లా ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని సాంబశివరెడ్డి అన్నారు అనంతరం రూ రెండు లక్షల విలువైన నాలుగు వందల మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో…
జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రేగా కళ్యాణి, మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షురాలు శానం నిర్మల, స్థానిక నాయకులు నాసిరెడ్డి నాగిరెడ్డి, ధూళిపాళ బాలకృష్ణ, గ్రామ కమిటీ అధ్యక్షుడు షేక్ మోయునుద్దీన్,తొండపు సంజీవరెడ్డి, కటుకూరు శేషయ్య, లక్కీ వెంకన్న, మరియు వికాస్ అగ్రి ఫౌండేషన్ ప్రతినిధులు సుమారు నాలుగు వందలకు మందికి పైగా మహిళలు పాల్గొన్నారు….