TRINETHRAM NEWS

నారా లోకేష్ సహకారంతో 60 మంది మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్లు పంపిణీ

స్త్రీ శక్తి సంక్షేమం పేరుతో మహిళలకు ఉచితంగా శిక్షణ, కుట్టు మిషన్లు అందిస్తున్న నారా లోకేష్

శిక్షణ పొందిన “40”వ బ్యాచ్ మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్లు, సర్టిఫికేట్స్ పంపిణీ

కుట్టుమిషన్లు, సర్టిఫికేట్స్ పంపిణీ చేసిన నియోజకవర్గ తెలుగు మహిళలు

మంగళగిరి టౌన్, జనవరి 20: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సహకారంతో నిర్వహిస్తున్న స్త్రీశక్తి కార్యక్రమం ద్వారా మహిళలకు కుట్టు శిక్షణ ఇవ్వడంతో పాటు స్వయం ఉపాధికి మార్గం చూపేందుకు ఉచితంగా కుట్టు మిషన్లు అందజేస్తున్నారని నియోజకవర్గ తెలుగు మహిళ అధ్యక్షురాలు ఆరుద్ర భూలక్ష్మి అన్నారు. తాడేపల్లి టౌన్, తాడేపల్లి రూరల్ మండలానికి చెందిన మహిళలు నిపుణుల పర్యవేక్షణలో శిక్షణ పొందారు. కుట్టు మిషన్ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు మంగళగిరి ఎమ్మెస్సెస్ భవన్ లో నియోజకవర్గ తెలుగు మహిళలు శనివారం సర్టిఫికెట్లు, కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. 40వ బ్యాచ్‌లో 60 రోజుల పాటు శిక్షణ పొందిన 60 మంది మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. మహిళల అభ్యున్నతి కోసం, వారి జీవనోపాధి కోసం కృషి చేస్తున్న నారా లోకేష్ కు కుట్టుమిషన్లు అందుకున్న లబ్ధిదారులు ధన్యవాదములు తెలియజేశారు. నారా లోకేష్ ఇస్తున్న సహకారం ఎప్పటికీ మర్చిపోలేమని మహిళలు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆరుద్ర భూలక్ష్మి మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగలనేదే లక్ష్యంగా నారా లోకేష్ ఉచితంగా కుట్టుమిషన్లు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. కుట్టు మిషన్లు అందుకున్న వారు స్వతహాగా ఎదుగుతూ వారి కుటుంబానికి, నారా లోకేష్ గారికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. వైసీపీ నాయకులు ఐదు సంవత్సరాలుగా ప్రజల సమస్యలను పక్కనపెట్టి వనరులను దోచుకోవడంపై దృష్టి చారించారని విమర్శించారు. వైసీపీ ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన హామీలు తుంగలో తొక్కారని తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, మహిళలపై మానభంగాలు, దాడులు, దౌర్జన్యాలు, బాలికలపై అఘాయిత్యాలు మితిమీరి పోయాయని ఆవేదన చెందారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్‌ సిలెండర్లు, అమ్మకు వందనం కింద రూ.15వేలు, ఇంట్లోని మహిళలందరికి నెలకు రూ.1500 చొప్పున ఆర్థిక సహాయం అందజేయడంతో పాటు నియోజకవర్గంలోని పేదలందరికీ 20 వేల ఇళ్లు, అసైన్డ్ మరియు ఇతర ప్రభుత్వ స్థలాల్లో నివసిస్తున్న పేదల ఇళ్లను రెగ్యులరైజ్ చేయడం జరుగుతుందన్నారు.

 ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు మహిళ ప్రధాన కార్యదర్శి ఆకుల జయసత్య, నియోజకవర్గ తెలుగు మహిళ ప్రధాన కార్యదర్శి మంచికలపూడి వైష్టవి, తాడేపల్లి పట్టణ మాజీ మున్సిపల్ చైర్మన్ కొయ్యగూర మహాలక్ష్మి, తాడేపల్లి పట్టణ తెలుగు మహిళ అధ్యక్షురాలు అన్నె కుసుమ, తాడేపల్లి మండల తెలుగు మహిళ అధ్యక్షురాలు బొర్రా కృష్ణ వందన, తాడేపల్లి మాజీ కౌన్సిలర్ కాటబత్తుని నిర్మల, నియోజకవర్గ తెలుగు మహిళ కార్యదర్శి జంగం జయభారతి, తాడేపల్లి పట్టణ తెలుగు మహిళ కార్యదర్శి కోడుమూరు ఆదిలక్ష్మి, యం అరుణ తదితరులు పాల్గొన్నారు.