
తేదీ : 28/03/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , నరసాపురం పట్టణంలోని 1వ వార్డులో గల లాకు పేటలో షా లేమ్ సామాజిక సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు రాష్ట్ర మాదిగ సంఘం నాయకుడు తెన్నేటి. సురేష్ కన్నా మాదిగ పలువురు పేదలకు నిత్య అవసర సరుకులను ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా మెడికల్ క్యాంపులు , వృద్ధులకు, వితంతువులకు, వస్త్రాల పంపిణీ, విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ , కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు . చెప్పారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
