నవంబర్ 12, 2026
TRINETHRAM NEWS
Distribution New Pensions

Distribution New Pensions : త్రినేత్రం న్యూస్ : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నూతన లబ్ధిదారులకు ‘చేయూత’ పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో మరో 4.5 లక్షల మంది అర్హులకు కొత్తగా పింఛన్లను మంజూరు చేశారు. ఈ నెల 12 నుంచి 18 వరకు అన్ని జిల్లాల్లో ఈ మంజూరు పత్రాల పంపిణీ ప్రక్రియ కొనసాగనుంది.

  • నవంబర్ 19న ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా నగదు జమ కానుంది.
  • తాజాగా మంజూరు చేసిన పింఛన్లతో కలిపి రాష్ట్రంలో కొత్త లబ్ధిదారుల సంఖ్య 5,73,625కు చేరింది.
  • వితంతువులు, దివ్యాంగులు, వృద్ధులతో పాటు మహిళలకు ఈ కొత్త పింఛన్లలో ప్రాధాన్యత కల్పించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page