అస్తవ్యస్తంగా పల్లెపాలన..!?
పల్లెలకు రాని ప్రత్యేకాధికారులు
స్పెషల్ ఆఫీసర్ల పాలనలో ప్రజల అవస్థలు..
గ్రామ సభలను నిర్వహించని వైనం
కొరవడిన ఉన్నతాధికారుల పర్యవేక్షణ
మే 27: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
గ్రామ పంచయతీ పాలకుల పదవి కాలం ముగియడంతో పంచాయతీలకు ప్రత్యేక అధికారులను ఏర్పాటు చేశారు. వారు ఎప్పుడు వస్తారో… ఎప్పుడు వెళ్తారో అది ఎవరికి తెలియదు. నామ్ కి వస్తేగా ప్రత్యేక అధికారులు విధులు నిర్వహిస్తున్నారు. దీనివల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామపంచాయతీలో సమస్యలు తీష్ట వేశాయి. పంచాయతీ కార్యదర్శులు సైతం కొన్ని జిల్లాల్లో అవినీతికి రుచి మరిగి.
ఇష్ట రాజ్యాంగ పనులు చేసి పెడుతున్నారు. అడిగేవారు లేరు అని కార్యదర్శులదే పెత్తనం చెలాయిస్తూ పంచాయతీ నిధులను మింగేస్తున్నారు. ఇంటి స్థలాల మార్పిడి, ఇళ్ల మార్పిడి లో భారీగా డబ్బులు మింగేస్తున్నారు. ఇప్పటికే కొన్నిచోట్ల అవినీతికి పాల్పడుతున్న పంచాయతీ కార్యదర్శులు ఏసీబీకి చిక్కారు. పంచాయతీలపై పాలకుల, అధికారుల పర్యవేక్షణ లేకపోవడం ప్రత్యేక అధికారుల, కార్యదర్శుల రాజ్యం ఏలుతున్నారు. వీరికి డిఎల్పిఓ, డిపిఓ అండ దండలతో పంచాయతీ కార్యాలయంలో అందిన కటికల్లా దోచుక తింటున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App