
Trinethram News : పల్నాడు జిల్లా గురజాల పట్టణంలో ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన వాలంటీర్ను, విధుల నుంచి తొలగిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆవుల గోపాలకృష్ణ అనే వాలంటీర్ ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా కరపత్రాలను అందించిన క్రమంలో, అందిన ఫిర్యాదు మేరకు ఆర్డీవో సదరు వాలంటీర్ను విధులు నుంచి తొలగించారు. వాలంటీర్ దగ్గర నుంచి సెల్ ఫోను బయోమెట్రిక్ డివైస్ను స్వాధీనపరుచుకున్నారు.
