మీడియాలో తన గురించే ప్రముఖంగా ప్రచారం జరుగుతుండడం పట్ల దిల్ రాజు విచారం వ్యక్తం చేశారు
Trinethram News : ప్రముఖ నిర్మాత దిల్ రాజు, ఆయన బంధువుల నివాసాలు, కార్యాలయాల్లో నిన్నటి నుంచి ఐటీ సోదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. పలువురు ఇతర నిర్మాతలపైనా ఐటీ దాడులు జరుగుతున్నాయి. అయితే మీడియాలో తన గురించే ప్రముఖంగా ప్రచారం జరుగుతుండడం పట్ల దిల్ రాజు విచారం వ్యక్తం చేశారు!ఐటీ సోదాలు తన ఒక్కడిపైనే జరగడంలేదని, ఇండస్ట్రీ అంతా జరుగుతున్నాయని దిల్ రాజు స్పష్టం చేశారు. ఐటీ అధికారుల సోదాలు జరుగుతున్న సమయంలో దిల్ రాజు బాల్కనీలోకి రాగా…. ఐటీ దాడులు పూర్తయ్యాయా? అని మీడియా ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు దిల్ రాజు పైవిధంగా సమాధానమిచ్చారు. ఐటీ అధికారులు వాళ్ల డ్యూటీ వాళ్లు చేస్తున్నారు అని వ్యాఖ్యానించారు. కాగా, నిన్న ఉదయం 6 గంటల నుంచి ఐటీ అధికారులు పలు బృందాలుగా ఏర్పడి హైదరాబాదులోని టాలీవుడ్ నిర్మాతలు, పలు సినీ మీడియా సంస్థలపై ఏకకాలంలో దాడులు చేపట్టారు. ఇవాళ కూడా సోదాలు కొనసాగుతున్నాయి
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App