
సమగ్ర శిక్ష ఉద్యోగుల రిలే నిరాహార దీక్షకు ధర్మ సమాజ్ పార్టీ మద్దతు
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్
సమగ్ర శిక్ష ఉద్యోగుల డిమాండ్లు రాజ్యాంగబద్దమైనవి, ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలి.
ధర్మ సమాజ్ పార్టీ వికారాబాద్ జిల్లా కమిటీఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా కేంద్రంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న రిలే నిరాహార దీక్షకు సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరిగింది. SSA ఉద్యోగుల డిమాండ్లు న్యాయబద్ధమైనవి,రాజ్యాంగబద్దమైనవి. కావున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2023 సెప్టెంబర్ నెలలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేసి, వారికి ఉద్యోగ భద్రతను, ఆరోగ్య భద్రతను కల్పించి, పనికి తగ్గ వేతనాలు కల్పించాలని ధర్మ సమాజ్ పార్టీ వికారాబాద్ జిల్లా కన్వీనర్ రవీందర్ మహారాజ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, SSA ఉద్యోగులు సమస్య పరిష్కారం కోసం ఎల్లప్పుడూ ధర్మ సమాజ్ పార్టీ మద్దతు ఉంటుందని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ధర్మ సమాజ్ పార్టీ జిల్లా కన్వీనర్ రవీందర్ మహారాజ్, కో కన్వీనర్ మల్లికార్జున్, DSP ముఖ్య నాయకులు వెంకటేష్, శివ, నర్సింలు, రాజు, మల్లేష్ పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
