Demanding to cancel the auction of coal blocks in Telangana and allocate them to Singareni
జులై 5న చలో పెద్దపెల్లి జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ ధర్నా
తెలంగాణ కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాల పిలుపు జయప్రదం చేయండి
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
గోదావరిఖని చౌరస్తాలో సిఐటియు ఆఫీసులో సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు అర్జి1, బ్రాంచి ముఖ్య కార్యకర్తల సమావేశం ఆరేపల్లి రాజమౌళి అధ్యక్షతన జరిగింది,
ఈ సందర్భంగా బ్రాంచి కార్యదర్శి మెండే శ్రీనివాస్ మాట్లాడుతూ, మూడోసారి భారతదేశంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే దేశంలోని బొగ్గు బ్లాక్ లను ఈ వేలం ద్వారా గుత్తా పెట్టుబడిదారులకు అమ్మలన్ని నిర్ణయించింది, తెలంగాణకు కొంగుబంగారంగా విరసిల్లుతున్న సింగరేణి మంచిర్యాల జిల్లాలోని శ్రావణ్ పెళ్లి బొగ్గు బ్లాక్ ను
ఈ వేళానికి పెట్టారని, పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపికి తెలంగాణ ప్రాంతం నుంచి ఎనిమిది ఎంపీ సీట్లు ఇచ్చినందుకు, మన తెలంగాణ ప్రాంతానికి చెందిన కిషన్ రెడ్డి బొగ్గు శాఖ మంత్రి అయినందుకు, తెలంగాణ బొగ్గు బ్లాక్ లను ప్రైవేటు గారికి అప్పజెప్పడం హేయమైన చర్యని ఖండించారు, కేంద్ర బిజెపి ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను, నిరసిస్తూ బొగ్గు బ్లాక్ ల రక్షణ కోసం పెద్ద ఎత్తున ఆందోళనల పోరాటాలు చేయాలని తెలంగాణ కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాల పిలుపు ఇవ్వడం జరిగిందని, అందులో భాగంగా రేపు జూలై 5న పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలకు ధర్నా నిర్వహించడం జరుగుతుందని, ఈ ధర్నా కార్యక్రమాన్ని సింగరేణి కార్మికులు విజయవంతం చేయాలని కోరారు, అలాగే జులై 10న సింగరేణి అన్ని జియం ఆఫీసుల ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు ఉంటాయని, జూలై 18న చలో సింగరేణి భవన్ ధర్నా కార్యక్రమం హైదరాబాదులో జరుగుతుందని, పై కార్యక్రమాలను సింగరేణి కార్మిక వర్గం విజయవంతం చేయాలని తెలంగాణ కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాల కరపత్రం విడుదల చేయడం జరిగింది,
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు తోట నరహరిరావు, బ్రాంచి ఉపాధ్యక్షులు దాసరి సురేష్, సానం రవి, పి శ్రీనివాస్, చందనవేణి రాజయ్య, రవీందర్ తదితరులు పాల్గొన్నారు,
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App