
Trinethram News : హైదరాబాద్ : సికింద్రాబాద్ ఆల్వాల్‌లో గురువారం మధ్యాహ్నం డీసీఎం వ్యాన్ బీభత్సం సృష్టించింది. ఆల్వాల్‌లోని ఓ సూపర్ మార్కెట్‌కు సరకులతో వచ్చిన డీసీఎం ఒక్కసారిగా పాదచారులపైకి దూసుకొచ్చింది. అదే సమయంలో తల్లితో పాటు నడుచుకుంటూ వెళ్తోన్న తిరుపాల్ (9)ను ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన బాలుడిని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. డీసీఎం వ్యాను డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు.
