పులివెందుల: తన తండ్రి షేక్ హాజీవలిపై జరిగిన దాడి ఘటనపై మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి స్పందించారు. కడప ఎంపీ అవినాష్‌రెడ్డి బెయిల్‌పై బయట ఉండటం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, బెయిల్ రద్దు చేయాలని కోరారు..
పులివెందులలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ”ఈ నెల 12న హైదరాబాద్ సీబీఐ కోర్టులో వాయిదాకు వెళ్తున్నా. నా తండ్రిపై జరిగిన దాడిపై కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తా. పులివెందుల వైకాపా నాయకులకు దమ్ముంటే నన్ను టచ్ చేయాలి..
నా కుటుంబం జోలికి రావాల్సిన అవసరం ఏముంది? నా కుటుంబం జోలికి వచ్చారు కాబట్టి.. వార్ వన్ సైడ్ అవుతుంది. వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు.. దేనికైనా సిద్ధం. పులివెందుల వైకాపా నాయకులు ఢీ అంటే ఢీ .. వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు” అని పేర్కొన్నారు..