భూపాలపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
భూపాలపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
ఇంటర్మీడియట్ పరీక్షల దృష్ట్యా విద్యార్థులకు జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఉచిత మధ్యాహ్న భోజన ఏర్పాటు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన ఎమ్మెల్యే వచ్చే విద్యా సంవత్సరం నుండి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోనూ మధ్యాహ్న భోజన పథకం అమలు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు భూపాలపల్లి క్రిష్ణకాలనీ రోడ్డులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మధ్యాహ్న భోజనాన్ని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ముందుగా ఎమ్మెల్యే కు కళాశాల ప్రిన్సిపల్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారు పుష్ప గుచ్చం అందించి స్వాగతం పలికారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన వేదికపై ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వచ్చే విద్యా సంవత్సరం నుండి ప్రజా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు చేసేందుకు సన్న హాలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఉన్నత పాఠశాల స్థాయి వరకు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం తిని సాయంత్రం తరగతులకు హాజరయ్యేవారని, ఇంటర్ విద్యార్థుల విషయానికి వచ్చేసరికి మధ్యాహ్న భోజనం అందకపోవడంతో విద్యార్థులు పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం ఆలోచన చేసి విద్యార్థుల కోసం మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు.
కాగా, ఈరోజు నుండి ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తి అయ్యేంతవరకు జిల్లా రైస్ మిల్లర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత మధ్యాహ్న భోజనాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే అన్నారు. అదేవిధంగా, భూపాలపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మౌలిక వసతులను ఏర్పాటు చేసిన విషయాన్ని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఈ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ఎక్కువగా గ్రామీణ ప్రాంతల నుండి ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు విద్యను అభ్యసించడానికి వస్తున్నారని అన్నారు. జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు తిరుపతి గౌడ్ కు ఎమ్మెల్యే శాలువా కప్పి అభినందించారు. అనంతరం విద్యార్థులకు ఎమ్మెల్యే స్వయంగా మధ్యాహ్న భోజనాన్ని వడ్డించి, అక్కడే విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App