రాష్ట్రాన్ని దివాలా తీయించి పైగా మా ప్రభుత్వంపై విమర్శలా
త్రినేత్రం న్యూస్ ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రతినిధి, వైసిపి నాయకులపై మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డిఫైర్ ఈరోజు మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమం లో మార్కాపురం పట్టణంలోని 10వ వార్డులో పాల్గొన్నారు. ఇంటింటికి వెడలి పెన్షన్ దారులకు వారి ఇంటి వద్దనే ఉదయాన్నే పెన్షన్ అందించారు.
ఈ సందర్భంగా శాసనసభ్యుల వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దివాలా తీయించి అప్పుల ఊబిలోకి నెట్టిన గత వైసిపి ప్రభుత్వం ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంపై బురద చల్లటం సిగ్గుచేటని అన్నారు.
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గత వైసిపి ప్రభుత్వం అన్ని విధాల సర్వనాశనం చేసిందని అయినా దేనికి వెరవకుండా తిరిగి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కిస్తున్న పెద్దాయన ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు ఉపముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ , యువ నాయకులు నారా లోకేష్ బాబు.ప్రతి నెల ఒకటవ తేదీ ఉదయానికే సంక్షేమ పెన్షన్లను పెన్షన్ దారుల ఇంటి వద్దనే ఇప్పిస్తున్నారని, అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఒకటో తేదీ తమ జీతాలు ఎకౌంట్లో పడుతున్నాయని ఇది ప్రజలు గమనించాలి అన్నారు.
ఆర్థికంగా ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా కూడా రాష్ట్రం ప్రభుత్వం అభివృద్ధి పనులను పరుగులెత్తిస్తున్నారని, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు.
అధికారం కోల్పోయిన ఏడు నెలలకే వైసీపీ నాయకులు ఓర్వలేక తెలుగుదేశం ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారని ఈరోజు వైసీపీ నాయకులు ఫీజు రీయింబర్స్మెంట్ పై ఆందోళనలు చేపట్టడం ఎంతవరకు సమంజసమని గత వైసిపి ప్రభుత్వం లోనే రీయంబర్స్మెంట్ ను విద్యార్థులకు అందకుండా వారి ఉసురు పోసుకున్నారని కానీ ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంపై విమర్శలు చేయటం ఏమిటని అన్నారు.
ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు.