అనంతపురం : బదిలీపై వెళ్లిన అధికారులు అధికార పార్టీ నేతలను ప్రసన్నం చేసుకోవడానికి ఆరాటపడటంపై విమర్శలు వస్తున్నాయి. ఎన్నికలు అత్యంత పారదర్శకంగా జరగాలంటే పోలీసుల పాత్ర కీలకం. అందుకే ఎన్నికలకు ముందు ఒకే జిల్లాలో చాలాకాలం పనిచేసిన వారిని ఇతర జిల్లాలకు బదిలీ చేస్తారు. అలా.. బదిలీపై వచ్చిన డీఎస్పీ శివభాస్కర్‌రెడ్డి గుంతకల్లులో బాధ్యతలు చేపట్టారు. వచ్చిన మొదటి రోజే గుంతకల్లు ఎమ్మెల్యే వై.వెంకట్రామిరెడ్డి, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డితో భేటీ అయ్యారు. పైగా.. నియోజకవర్గంలోని సీఐలు, ఎస్సైలందరినీ ఎమ్మెల్యే ఇంటికే పిలిపించుకొని మాట్లాడారు. అధికార పార్టీ నేతలతో అంటకాగే అధికారులు ఎన్నికల విధుల్లో ఎలా నిష్పక్షపాతంగా ఉండగలరని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
బదిలీపై వెళ్లిన అధికారులు అధికార పార్టీ నేతలను ప్రసన్నం చేసుకోవడానికి ఆరాటపడటంపై విమర్శలు వస్తున్నాయి
Related Posts
RDO Arrested : ఆర్డీవో మురళి అరెస్ట్
TRINETHRAM NEWS ఆర్డీవో మురళి అరెస్ట్…! ఆర్డీఓ మురళిని తిరుపతిలో అరెస్ట్ చేసి ఏక కాలంలో తిరుపతి, మదనపల్లెలో గల ఆర్డీఓ మురళి ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తున్న ఏసీబీ అధికారులు. మురళీతో మదనపల్లె రూరల్ పొన్నూటిపాళ్యం వీఆర్వో శేఖర్ ఇంట్లో కూడా…
చాగంటి కి అదిరిపోయే పోస్ట్ ఇచ్చిన చంద్రబాబు
TRINETHRAM NEWS చాగంటి కి అదిరిపోయే పోస్ట్ ఇచ్చిన చంద్రబాబు Trinethram News : Andhra Pradesh : ఏపీ కూటమి ప్రభుత్వం మళ్లీ నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తూ రెండో జాబితాను ప్రకటించింది. ఇప్పటికే కొన్ని నెలల క్రితం తొలి…