TRINETHRAM NEWS

నేరాల రేటు తగ్గింది – సీపీ

దిశ యాప్ నేర నివారణలో చాలా కీలకంగా మారిందని విశాఖపట్నం సీపీ రవి శంకర్ అయ్యనార్ అన్నారు. శుక్రవారం ఆయన వార్షిక క్రైం రేట్ సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. గతంతో పోలిస్తే 30 శాతం క్రైం రేట్ తగ్గిందన్నారు. కానీ, సైబర్ క్రైం రేట్ పెరిగిందని చెప్పారు. అయితే దానికి కారణాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. అయితే మహిళలపై దాడులు కసులు తగ్గాయని, దిశ ప్రభావంతో మహిళల భద్రత పెరిగిందన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘ఈ సంవత్సరంలో 27 హత్యలు జరిగాయి. అందులో ఎక్కువగా అక్రమ సంబంధాలు, ఆవేశంలో చేసిన హత్యాలే అధికంగా ఉన్నాయి.

దిశ యాప్ నేర నివారణలో చాలా కీలకంగా మారింది. 21 లక్షల మందికి పైగా దిశ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు. ఇందులో మహిళా పోలీసులని అభినందిస్తున్నాను. దిశ కౌన్సిలింగ్ సెంటర్ల ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయి. చాలా కేసులు ఇక్కడే కంప్రమైస్ అవుతున్నాయి. మహిళా పోలీసులు అన్ని అంశాలపై పాఠశాలల్లో అవగాహనా కల్పిస్తున్నారు. గంజాయి రవాణాకు విశాఖను కేంద్రంగా ఎంచుకుంటున్నారు. గంజాయి సాగుని పూర్తిగా ధ్వంసం చేసాం. ఒరిస్సా నుంచే ఎక్కువ గంజాయి విశాఖ వచ్చి వేరే రాష్ట్రాల కు వెళుతుంది. ఈ రవాణాను నివారించేందుకు పటిష్టంగా పని చేయబోతున్నాం. గతంతో పోల్చుకుంటే ఇక్కడ గంజాయి వాడకం తగ్గింది. 2022 లో 39 మర్డర్ కేసులు నమోదు కాగా 2023 లో 24 మర్డర్ కేసులు నమోదు అయ్యాయి.

2022లో 42 కిడ్నాప్ కేసులు నమోదు కాగా..2023 లో 18 కిడ్నాప్ కేసులు నమోదు అయ్యాయి. 2022 లొ 127 అత్యాచారం కేసులు నమోదు కాగా 2023 లో 78 కేసులు నమోదు అయ్యాయి. 2022 లో 65 అటెంపెట్ టు మర్డర్ కేసులు నమోదు కాగా.. 2023 లో 47 అటెంపెట్ టు మర్డర్ కేసులు నమోదు అయ్యాయి. 2022 లో 841 వైట్ కలర్ క్రైమ్ కేసులు నమోదు కాగా. 2023 లో 723 వైట్ కలర్ క్రైమ్ కేసులు నమోదు అయ్యాయి. వర కట్నం వేధింపుల వలన మృతి చెందిన కేసులు 2022 లో 6 కాగా 2023 లో 7 కేసులుగా నమోదయ్యాయి. 498-A సెక్షన్ల కింది కేసులో 2022లో 714గా ఉండగా.. 2023లో 479గా నమోదయ్యాయనీ సీపీ వివరించారు.