
అల్లూరి జిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ మార్చి 12 : ఈ మేరకు మంగళవారం అరకు వేలి మండలం,చోంపి గ్రామాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ప్రజా చైతన్య యాత్రలో భాగంగా సందర్శించి గ్రామంలో ఉన్న రైతులతో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వి. ఉమామహేశ్వరరావు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గత కొంతకాలంగా గ్రామంలో సాగునీరు త్రాగునీరుకి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గ్రామంలో ఉన్న పెద్ద చెరువుని తక్షణం పూడికలు తీయించి రక్షణ గోడ నిర్మించి చెరువుని అందుబాటులోకి తీసుకొస్తే 400 ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు.
అదేవిధంగా గ్రామంలో తాగునీటికి తీవ్రమైన సమస్య ఉందని తక్షణం మధ్యలో నిలిపివేసిన జల్ జీవన్ పథకాన్ని ప్రారంభించి మంచినీటి సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు. గ్రామంలో కాఫీ, మిరియాలు రైతులు మధ్య దళారుల దగ్గర మోసపోతున్నారని తక్షణం మిరియాలు కేజీ ₹1000 కిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. గతంలో ఈ గ్రామాన్ని గవర్నర్ పర్యటన చేశారని కానీ సమస్యలు అలాగే కొనసాగుతున్నాయని గ్రామంలో ఎటువంటి మార్పులు లేవని తెలిపారు.
పంచాయితీకి రాష్ట్ర ప్రభుత్వం తక్షణం అభివృద్ధికి నిధులు కేటాయించాలని అన్నారు స్మశాన వాటికి రహదారి సౌకర్యం కూడా లేని పరిస్థితి ఉందని అన్నారు. ఈనెల 17వ తేదీన స్థానిక సచివాలయం వద్ద ఆందోళన నిర్వహించి డిమాండ్ తో కూడిన వినతి పత్రం ఇస్తామని తెలిపారు అదేవిధంగా ఈనెల 24వ తేదీన స్థానిక తహసిల్దార్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఎం గ్రామ నాయకుడు రెండవ వార్డ్ మెంబర్ బద్నాయికి కోగేశ్వరరావు, పిసా గ్రామ కమిటీ కార్యదర్శి దశరథ్, ఆనందు, గ్రామ పెద్ద మాజీ వార్డు సభ్యులు పండు తదితరులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
