TRINETHRAM NEWS

ఆంధ్రప్రదేశ్, త్రినేత్రంన్యూస్, ( పాడేరు ) జిల్లా ఇంచార్జ్ : గ్రామాల అభివృధికీ ప్రత్యేక నిధులు కేటాయించాలి. త్రాగునీరు, డ్రైనేజ్,వీధి దీపాలు లేని గ్రామాలు. కూటమి ప్రభుత్వం దృష్టి సారించాలి.

*మార్చి 9 నుండి 25 వరకు జిల్లా చైతన్య యాత్ర ముగింపు ధర్నా లో పార్టీ జిల్లా కార్యదర్శి పి. అప్పల నరస డిమాండ్.

ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రత్యేక అభివృథికి నిధులు కేటాయించాలని ,సి.పి.ఎం పార్టీ జిల్లా కార్యదర్శి పి. అప్పల నరస రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.

పార్టీ ప్రజా చైతన్య యాత్ర లో ముగింపు లో భాగంగా పాడేరు మండల ప్రజా పరిషత్ కార్యాలయం లో ప్రజలతో ధర్నా నిర్వహించి, స్థానిక ఎంపిడిఓ కార్యాలయం ఈఓ కి దరఖాస్తులు సమర్పించారు.

పాడేరు మండలం పార్టీ కార్యదర్శి ఎల్.సుందరరావు అధ్యక్షతన జరిగిన దర్నలో పార్టీ జిల్లా కార్యదర్శి పి అప్పల నరస మాట్లాడుతూ మార్చి 8 తేదీ నుండి 25 తేదీ వరకు గ్రామ పర్యటన నిర్వహించి ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి అర్జీలు సమర్పించాలని, సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు యాత్ర నిర్వహించాం అన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా లో 11 మండలం లో సుమారు 2020 గ్రామాలకు ప్రజా చైతన్య యాత్ర బృందం క్షేత్ర స్థాయిలో పర్యటన నిర్వహించిందని, ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు కావస్తున్నా నేటికీ గ్రామాల్లో ఉమ్మడి మరియు వ్యక్తిగత సమస్యలు పరిష్కారానికి ప్రభుత్వం నిధులు కేటాయించలేదని అన్నారు. గ్రామాల్లో ఇల్లు స్థలం లేని పేదలకు ప్రభుత్వం తక్షణమే స్థలం కేటాయించాలని, ఇల్లు లేని వారికి ఇల్లు మంజూరు చేయాలని కోరారు. పీఎం జన్మన్ స్కీం కింద ఇవి మంజూరు చేస్తున్న ఇళ్లకు యూనిట్ కాస్టు 10 లక్షల రూపాయలకు పెంచాలని, త్రాగునీరు, పెన్షన్లు తదితర సమస్యలు తీవ్రంగా ఉందని అన్నారు.

వేలాది ఎకరాలకు సాగునీరు అందించేందుకు చెక్ డ్యాం నిర్మాణం చెప్పడానికి ప్రభుత్వం సర్వే చేపట్టాలని,చెరువు లో మట్టి పూడిక తీయాలని,ప్రజలు కోరుతున్నారని అన్నారు. పి.ఎం కిసాన్ కొంత మంది కి ప్రభుత్వం రాయితీ అందడం లేదని, ఉపాధి పనులు ప్రారంభం తక్షణం చేయాలని,గతం లో రెండు వారం రోజులుగా పనులు చేసిన వారికి డబ్బులు చెల్లించలేదని అన్నారు.అటవీ హక్కు పత్రాలు ఇవ్వకుండా తీవ్రమైన అన్యాయంగా మారిందని ఉన్నారు. రేషన్ కార్డులు పించన్లు కొంతమందికి మంజూరు కోసం ప్రభుత్వం కార్యాలయం చుట్టూ తిరుగుతూ ఉంటే కనీసం అధికార్లు స్పందించడం లేదన్నారు. కాఫీ,మిరియాల పంటల ధరలు దళారి పడందని పేర్కొన్నారు. గ్రామాల్లో రొడ్,డ్రైనేజ్ త్రాగునీరు,వీధి దీపాలు సమస్యలతో కొట్టిమిట్టి ఆడుతుంన్నారని, ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదని అన్నారు.
పార్టీ జిల్లా కమిటీ సభ్యులు పి. లక్కు మాట్లాడుతూ పాడేరు మండలం లో రేషన్, పెన్షన్,పాటు కాఫీ మిర్యాలు రైతులకు ఉచితంగా నిచ్చెనలు, పల్పింగ్ మిషన్లు రైతులకు ఉచితంగా ఇవ్వాలని, అలాగే అంత్యోదయ కార్డు దారులకు 35 కేజీలు బియ్యం పునరుద్ధరణ చేయాలని, రోడ్డు నిర్మాణానికి ఫారెస్ట్ అధికారుల ఆటంకలు తొలగించాలని, వనుగుపల్లి, మోదపల్లి, మినుములురు, చింతలవీధి, గుత్తులపుత్తు, ఈరాడపల్లి,బడిమేలా, డోకూలూరు వంతాడపల్లి,పంచాయతీలకు అన్ని గ్రామాలకు మంచినీరు, సిసి రోడ్డు డ్రైనేజీ వ్యవస్థ బాగు చేయాలని కోరారు.
స్పందించిన ఎంపీడీవో ఆఫీస్ AO , వచ్చిన సమస్యలు సత్వరమే పరిష్కారం చేస్తామని, మిగిలిన సమస్యలు మా పరిధి దాటి ఉన్నాయి, వాటికోసం ప్రభుత్వానికి తెలియజేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా జిల్లా నాయకులు వంతల దాస్, సిపిఎం మండల నాయకులు D.బొజ్జన్న,సతీష్, గణేష్,మహేష్ సుందరరావు, నగేష్, కృష్ణ, రాజు, వాసు, శివలు వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

CPM party leaders in